నిమ్మగడ్డ రమేష్.. ప్రస్తుతం ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరేమో.. ఏపి రాజకీయాల్లో వేడి వాతావరణాన్ని సృష్టించాడు. అధికార పార్టీ వర్సెస్ ప్రతిపక్షాలు అన్న విధంగా ఆయనే మొత్తం చేశాడు. మొన్నీ మధ్య రాజకీయాల్లో చిచ్చు పెట్టిన పంచాయితీ ఎన్నికలను నిర్వహించడం కోసం నిమ్మగడ్డ అధికార పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. నేను చెప్పిందే వినాలి అన్నట్లు వ్యవహరించారు. అనుకున్నట్లు గానే ఎన్నికలను పూర్తి చేశారు. టీడీపీకి అనుకూలంగా వ్యవహరించిన ఆయన అధికార పార్టీ విజయంతో మారిపోయాడు. ఇప్పుడు ఏకంగా చంద్ర బాబు పై దాడి చేయడం మొదలు పెట్టారు.


ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఎన్నికల సంఘం సాధికారితను, రాజ్యాంగం, ఎన్నికల సంఘానికి ఇచ్చిన అధికారాన్ని కాపాడుకోవడానికి ఆయన చేసిన పోరాటం అనన్యసామాన్యమైనది. ఎవరూ తప్పుపట్టలేరు కూడా. ఒక దశలో టీఎన్ శేషన్‌లాంటి అత్యున్నతమైన అధికారితో పోల్చారు. ఎంతమంది తిట్టినా, వ్యక్తిగతంగా టార్గెట్ చేసినా ఎక్కడా వెనక్కి తగ్గకుండా రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరగాల్సిందేనని, పట్టుబట్టి న్యాయవ్యవస్థను ఉపయోగించుకుని కోర్టుకు వెళ్లి కూడా గెలిచి మొత్తం మీద ఎన్నికలు జరిగేంత వరకూ ఆయనను అలాగే చూశారు. ఎన్నికల కమిషనర్‌గా ఇప్పటికే ఆయనను అలాగే చూడాల్సిన అవసరం ఉంది.


రెండో విడత ఎన్నికల నుంచి పంచాయతీల్లో జరుగుతున్న అక్రమాలను ఎన్నికల కమిషన్ అడ్డుకోలేకపోయింది. చివరికి కౌంటింగ్ కేంద్రాలను కూడా కబ్జా చేసేసి.. కరెంట్ తీసేసి మరీ అర్ధరాత్రి ఫలితాలు మార్చేస్తుంటే.. అవతలి వాడు గెలిచినట్టు ప్రకటిస్తుంటే ఎన్నికల కమిషన్ చోద్యం చేస్తుందనే విమర్శ ప్రతిపక్షాల నుంచి వచ్చింది.అయిన మౌనం పాటించారు. దీంతో ప్రజాస్వామ్యం కోసం పోరాడిన నిమ్మగడ్డకు ఇప్పుడు ఏమైంది?. ఎన్నికల నిర్వహణలో ఫెయిలవుతున్నారనే ఆరోపణలు ఎందుకు వచ్చాయి?. ఏకంగా జగన్‌తో రాజీపడ్డారని విపక్షాలు ఎందుకు అనుమానిస్తున్నాయి? జగన్ తో చేతులు కలిపారా? ఇలాంటి రక రకాల ప్రశ్నలు టీడీపీ శ్రేణుల్లో కలుగుతుంది.. ఇక టీడీపీ నేతల్లో భయం మొదలైంది. రానున్న పురపాలక ఎన్నికలు అధికారిక పార్టీకి అనుకూలంగా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: