క్రికెట్ లో దిగ్గజాలు గా కొనసాగుతున్న ఆటగాళ్లు కూడా కొన్ని కొన్ని సార్లు టైం బాగా లేకపోతే చెత్త రికార్డులు నమోదు చేస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే. ఎప్పుడూ మైదానంలో పరుగుల వరద పారిస్తూ  స్కోరుబోర్డును పరుగులు పెట్టించే  ఆటగాళ్లు సైతం.. కొన్ని కొన్ని సార్లు పేలవ ప్రదర్శన చేసి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదురుకుంటూ  ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే టీమిండియా డేర్ అండ్ డాషింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఇలాంటి తరహా విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ఎప్పుడు తనదైన బ్యాటింగ్  తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించేవాడు విరాట్ కోహ్లీ.


 కానీ ఇప్పుడు మాత్రం కోహ్లీ పేలవ ప్రదర్శన చేసి చెత్త రికార్డు నమోదు చేశాడు అని చెప్పాలి.  అయితే క్రికెట్ లో కేవలం విరాట్ కోహ్లీ కే కాదు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి కూడా ఎంతో క్రేజ్ ఉంది అన్న విషయం తెలిసిందే. ఇకమహేంద్ర సింగ్ ధోనీకి  ఎంత దిగ్గజ క్రికెటర్ అయినప్పటికీ కొన్ని చెత్త రికార్డులు కూడా మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉన్నాయి.  అయితే ఇటీవలే మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉన్న ఒక చెత్త రికార్డును విరాట్ కోహ్లీ సమం చేశాడు. ఇటీవల ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో  భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణిస్తాడు అని ప్రేక్షకులు.. అనుకున్నారు.



 కానీ ఊహించని విధంగా విరాట్ కోహ్లీ ఒక్క పరుగు  కూడా చేయకుండానే డకౌట్  కావడం గమనార్హం. ఇటీవల జరిగిన డకౌట్ తో కోహ్లీ ఒక చెత్త రికార్డును సమం చేశాడు. 8 సార్లు టెస్టు కెప్టెన్గా విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. అయితే గతంలో ఈ చెత్త  రికార్డు భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉండేది. కానీ ప్రస్తుతం కోహ్లీ కూడా 8 సార్లు టెస్ట్ కెప్టెన్ గా  డకౌట్ అయ్యి  చివరికి ధోని చెత్త రికార్డును సమం చేశాడు. ఇప్పుడు వరకు విరాట్ కోహ్లీ టెస్టుల్లో  12 సార్లు డకౌట్ కావడం గమనార్హం అయితే కోహ్లీ అవుట్ కావడంతో ఇక అభిమానులు అందరూ నిరాశలో  మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: