అయితే ఓ మహిళ తన వద్ద మ్యూజిక్ నేర్చుకోవడానికి వచ్చిన 14 సంవత్సరాల కుర్రాడితో బలవంతంగా శృంగారం జరిపడంతో అతడు ఓ బిడ్డకు తండ్రి కావాల్సి వచ్చింది. ఈ ఘటన న్యూజిల్యాండ్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆక్ లాండ్ లోని 36 ఏళ్ల మహిళ, తన కొడుకు స్నేహితుడికి మ్యూజిక్ నేర్పుతానని క్లాసులు కోసం రోజూ ఇంటికి రమ్మని ఆహ్వానించింది. పియానో అంటే ఎంతో ఇష్టం ఉన్న ఆ కుర్రాడు రోజూ బుద్ధిగా ఆంటీ వద్దకు రోజూ వెళ్లేవాడు.
అయితే అదే అదనుగా భావించిన ఆ మహిళ అతడిని లొంగతీసుకొని లోబరుచుకొని కొన్నాళ్లుగా లైంగిక వేధింపులకు పాల్పడుతోంది. ఇక అతను తమ ఇంటికి వచ్చిన ప్రతీసారి బలవంతంగా అతనితో సెక్స్ చేయించుకుంటూ వచ్చింది. ఏం జరుగుతుందో తెలియని ఆ పిల్లాడు, కొన్ని రోజుల తర్వాత ఈ విషయాన్ని తల్లి దండ్రులకు తెలియజేయడంతో విషయం బయటపడింది. దీనిపై బాలల రక్షణ బృందాలకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అయితే, ఈ పిల్లాడి కారణంగా ఆ మహిళ అప్పటికే గర్భం దాల్చినట్లు, ఓ హాస్పిటల్ లో డెలివరీ కూడా అయినట్లు తెలిసింది. బాలుడిపై లైంగిక వేధింపులకు దిగినందుకు గానూ, ఆ మహిళపై క్రిమినల్ కేసు పెట్టాలని భావిస్తున్నారు పోలీసులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి