ముఖ్యంగా ఆయా పార్టీలకు చెందిన నేతలు అందరూ రంగంలోకి దిగి తమ ప్రసంగాలతో ఓటర్ మహాశయులకు ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో తమదే విజయమని అంటూ ప్రస్తుతం అన్ని పార్టీలు ఎంతో ధీమాతో ఉన్నాయి. అదే సమయంలో అటు సెట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడానికి అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా ఎంతో వ్యూహాత్మకంగానే ముందుకు కదులుతోంది. అయితే ఇటీవలే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే ఈ ప్రచారంలో భారీగా అభిమానులు తరలి వచ్చారు.
ఈ సందర్భంగా తన ప్రసంగంతో ఓటర్ మహాశయులకు ఆకట్టుకున్నారు ఎంపీ రేవంత్ రెడ్డి. ముఖ్యంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో సానుభూతి పనికొస్తుంది అనే ఉద్దేశంతోనే నోముల భగత్ కు సీటు ఇచ్చారు అంటూ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. దుబ్బాక నియోజక వర్గంలో ఉప ఎన్నికలు జరిగిన సమయంలో ఒక్కసారి కూడా పర్యటించని ముఖ్యమంత్రి కేసీఆర్ సాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికల కోసం రెండుసార్లు ఎందుకు రావడానికి సిద్ధమయ్యారు అంటూ ప్రశ్నించారు. ఓటమి భయంతోనే కె.సి.ఆర్ ఇలా చేస్తున్నారు అంటూ ఆరోపించారు ఎంపీ రేవంత్ రెడ్డి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి