కరోనా వైరస్  కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరోసారి కఠిన ఆంక్షలు అమలులోకి తెచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు సంఖ్య భారీగానే ఉంది. మొన్నటి వరకు కేవలం పదుల సంఖ్యలో నమోదైన కేసుల సంఖ్య ఆ తర్వాత వందల సంఖ్యలో కి చేరుకున్నాయి.  ఇక ఇప్పుడు మళ్ళీ  వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఏకంగా వేల సంఖ్యలోకి చేరుకున్నది కరోనా వైరస్  కేసుల సంఖ్య. దీంతో తెలంగాణ ప్రజానీకం మరోసారి భయాందోళనలో పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.



 అయితే ఒకప్పుడు  వైరస్ పై అంతగా అవగాహన లేకపోవడంతో ప్రభుత్వం వైరస్ నియంత్రణకు తీవ్రంగా శ్రమించాల్సినా పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రస్తుతం మాత్రం  ప్రజలలో అవగాహన రావడంతో ఈ కరోనా వైరస్ నిబంధనలు పాటించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు వస్తుందని తెలుస్తోంది. ముఖ్యంగా  వైరస్ నియంత్రణలో మాస్కులు ధరించడం భౌతిక దూరం పాటించడం తప్పనిసరిగా మారింది. ఇలాంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా  వైరస్ పై అవగాహన తెచ్చుకుని ఇక మాస్కు ధరించడానికి ఇష్టపడతున్నారు. కానీ ఇప్పటికీ కూడా కొంతమంది మాస్క్ ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.



 వెరసి రోజురోజుకు  వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. అయితే  వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మళ్లీ కఠిన ఆంక్షలు అమలులోకి తెచ్చింది. ముఖ్యంగా మాస్క్ పెట్టుకోకపోతే భారీ జరిమానాలు విధిస్తుంది. అయితే మాస్క్ పెట్టుకోని వారికి వెయ్యి రూపాయల జరిమానా విధించాలని తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి సోమేష్కుమార్ జిల్లా కలెక్టర్లు పోలీసులు కమిషనర్లు ఎస్పీలకు ఆదేశాలు జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. మమ్మల్ని ఎవరు చూస్తాలే అని నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై సిసి కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేసి జరిమానా విధించనున్నట్లు తెలుస్తోంది. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా.. మాస్కులు పెట్టుకోని వారిపై కేసులు కూడా పెట్టేందుకు సిద్ధమయ్యారు అధికారులు.  వైరస్ నిబంధనలు ఎవరు కూడా తేలిగ్గా తీసుకోవద్దని ప్రతి ఒక్క నిబంధన తూచా తప్పకుండా పాటించాలి అని సూచిస్తున్నారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: