మొత్తానికి తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక విజయవంతగా ముగిసింది. ఇపుడు అందరి దృష్టి ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి అన్న దాని మీదనే ఉంది. ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. వైసీపీ మెజారిటీ విషయంలో ఓ వైపు చర్చోపచర్చలు సాగుతున్నాయి.

వైసీపీకి గత ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే ఈసారి తగ్గుతుంది అని విపక్షాలు అంచనా వేస్తూంటే తమ మెజారిటీకి ఏమీ ఢోకా లేదు అని ఆ పార్టీ నిబ్బరంగా ఉంది. దానికి కారణాలు కూడా చెబుతోంది. వైసీపీకి గట్టి పట్టున్న ఎస్సీ నియోజకవర్గంలో పోలింగ్ బాగా ఈసారి జరిగింది. సుళ్ళూరుపేట, సత్యవేడులలో ఓలింగ్ 70 శాతానికి దాటేసింది. ఇక గూడూరులో 63 శాతం పోలింగ్ జరిగినట్లుగా చెబుతున్నారు. ఇక మరో వైపు తిరుపతిలో కూడా గతంలో టీడీపీకి స్వల్ప మెజారిటీ వస్తే ఈసారి అది మారి తమకు భారీ మెజారిటీ దక్కుతుంది అంటున్నారు. వెంకటగిరిలో కూడా వన్ సైడ్ గానే ఓటింగ్ జరిగింది అని లెక్కలు వేసుకుంటున్నారు.

సర్వేపల్లి, శ్రీకాళహస్తిలలో కూడా ఓటింగ్ తమకు ఫేవర్ గానే ఉంది అంటున్నారు. మొత్తానికి చూస్తే అటు బీజేపీకి కానీ ఇటు టీడీపీకి కానీ తిరుపతి  మీదనే ఎక్కువ ఆశలు ఉన్నాయి. కానీ అక్కడ వైసీపీ ఆధిపత్యం ఈ మధ్య బాగా పెరిగింది అంటున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే మూడున్నర లక్షల ఓట్లకు తగ్గకుండా మెజారిటీ వస్తుందని వైసీపీ నేతలు ధీమా పడుతున్నారు పెరిగితే ఇంతకంటే ఎక్కువ మెజారిటీ వచ్చినా  ఆశ్చర్యపోనవసరం లేదు అని కూడా అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే పోలింగ్ శాతం గతం కంటే 15 శాతం తగ్గినా కూడా వైసీపీ మెజారిటీ మీద దాని ప్రభావం అసలు ఉండదని కూడా అంటున్నారు. మరి చూడాలి ఈవీఎం మిషన్లు అసలు నిజాలు ఎలా చెబుతాయో. ఎవరి జాతకాలు ఎలా రాసి పెట్టాయో.




మరింత సమాచారం తెలుసుకోండి: