కరోనా మహమ్మారి నోటి నుంచి వేగంగా వ్యాపిస్తుంది.. మనిషి నుంచి వస్తున్న గాలి ద్వారా మరో మనిషికి వ్యాపిస్తుందని వైద్యులు వెల్లడించారు. అందుకే ఎక్కడికి వెళ్ళినా కూడా మాస్క్ లు తప్పనిసరి అని హెచ్చరిస్తారు. నోటి ద్వారా వైరస్ సెకను కాలంలో సంక్రమిస్తుంది. గాలిలొ వైరస్ వ్యాప్తి అత్యధికం.. మొదటి దశ కరోనా కన్నా రెండో దశ కరోనా చాలా వేగంగా మనుషులకు సోకుతుంది. ఎంత వేగంగా మనుషులకు సోకుతుందో అంతే తొందరగా శ్వాస ఆడక ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో మృత్యువు తో పోరాడుతున్నారు. 


ఈ క్రమంలో ప్రాణాలను విడుస్తున్నారు. అందుకే మాస్క్ లేకుండా బయటకు వస్తే కఠిన చర్యలను తీసుకుంటున్నారు. కాగా, కరోనా నియంత్రణలో భాగంగా వ్యాక్సిన్ వచ్చిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ డోస్ లను తీసుకున్నారు. భారత్ లో మాత్రం వ్యాక్సిన్ ల కొరత ఏర్పడటంతో మృత్యువు కౌగిట్లోకి చాలా మంది వెళ్తున్నారు. ఇప్పుడు అమెరికా వంటి అగ్ర రాజ్యాల సాయంలో వ్యాక్సిన్ భారత్ లోకి వచ్చింది. ఒకవైపు వ్యాక్సిన్ పంపిణీ జరుగుతున్నా కూడా మరణాల రేటు కబళించి వేస్తుంది..


ఇది ఇలా ఉండగా .. అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. అమెరికా ప్రజలకు ఆ విషయాన్ని స్పష్టం చేసింది. అదేంటంటే..టీకాలు వేసిన అమెరికన్ల కోసం మాస్కుల పై సిడిసి తన సలహాను మంగళవారం అప్‌డేట్ చేసింది. యుఎస్‌లో పూర్తిగా టీకాలు వేసిన వ్యక్తులు ఇకపై బైకింగ్ లేదా ఒంటరిగా  మరియు బయట భోజనం చేసేటప్పుడు చిన్న సమూహాలలో ఉన్నప్పుడు మాస్కుకు ధరించాల్సిన అవసరం  లేదని సిడిసి డైరెక్టర్ రోషెల్ వాలెన్స్కీ పేర్కొన్నారు..పూర్తిగా టీకాలు వేయించుకున్న వారు వారి పనులను యదావిధిగా కొనసాగించవచ్చు.. నాకు ఏం కాదు అనుకునేవాళ్లు కార్యాలయాలకు మరియు ఇతరత్రా పనులు చేసుకొనే వారు స్వల్ప పాటి జాగ్రత్తలను తీసుకోవాలి.. అప్పుడే సురక్షితంగా ఉంటుందని తేల్చి చెప్పారు.. అమెరికన్ లకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.. 




మరింత సమాచారం తెలుసుకోండి: