ఈ విషయం మళ్లీ పరిశోధనలు జరిపారు.టీకాపై నమ్మకం పెంచే శుభవార్తను బ్రిటన్ శాస్త్రవేత్తలు తాజాగా వెల్లడించారు. టీకా తీసుకున్న తరువాత కలిగే సైడ్ ఎఫెక్ట్స్‌పై వారు అధ్యయనం జరపగా..ప్రతి నలుగురిలో ఒకరికి స్వల్ప స్థాయిలో శారీరక ఇబ్బందులు కలిగినట్టు పరిశోధకులు గుర్తించారు.తల నొప్పి , ఒళ్ళు నొప్పులు వంటి స్వల్ప లక్షణాలు రావడం కామన్.. రెండు , మూడు రోజులు అయ్యాక తగ్గిపోవడం జరుగుతుంది. అంటూ అధ్యయనాల్లో రుజువైంది.
టీకా వేసిన తరువాత 12 నుంచి 21 రోజుల మద్య ఇన్ఫెక్షన్ రేటు భారీగా తగ్గినట్టు ఈ అధ్యయనంలో తేలింది. ఫైజర్ టీకా ద్వారా 50 శాతం, ఆస్ట్రాజెనెకా ద్వారా 32 శాతం మేర ఇన్ఫెక్షన్ రేటులో కొత పడింది. ఇక 21 రోజుల తరువాత..ఫైజర్ టీకా కారణంగా ఇన్ఫెక్షన్ రేటులో 69 శాతం కోత పడగా.. ఆస్ట్రాజెనెకా విషయంలో ఇది 60 శాతంగా ఉంది. టీకా తీసుకున్న అనంతర విపరీతంగా తల నొప్పి వచ్చిందని కొందరు అనగా, ఇకపోతే టీకా ఇచ్చిన ప్రాంతంలో నొప్పిగా అనిపించిందని కూడా అధికశాతం మంది పరిశోధకుల దృష్టికి తీసుకెళ్లారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. 55 ఏళ్ల లోపు వారిలోనే సైడ్ ఎఫెక్ట్స్ అధికంగా కనిపించాయట. క్లినికల్ ట్రయల్స్‌తో పోలిస్తే టీకా కార్యక్రమం ప్రారంభమైన తరువాత తక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్లు గుర్తించారు. ఈ పరిశోధనల తో అపోహలు తొలగి పోయినట్లే .. ఇప్పుడు నిర్బ్యంతరంగా టీకాను వేసుకోవచ్చు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి