మాములుగా పెద్దలు ఒక సామెత అంటారు.. కళ్యాణం వచ్చిన.. కక్కు వచ్చిన అస్సలు ఆగదు అని.. అది నిజమే ఆ గడియలు వస్తే ఎలాగైనా
పెళ్లి జరుగుతుంది. ఎవరు వచ్చినా, మోహమాటాలకు పోయి రాకున్నా కూడా
పెళ్లిమాత్రం ఆగదు.. ఇది నిజమే..అందుకే దేశంలోని అనేక రాష్ట్రాలు కరోనాతో సతమవుతున్నా కొన్ని పెళ్లిల్లు మాత్రం ఆగకుండా జరుగుతున్నాయి..అందుకేనేమో మాంగళ్యబలం సమయాన్ని, విలువను సాంప్రదాయికంగా ఇంకా బలంగా విశ్వసిస్తున్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా భయంతో చాలా మంది బయటకే రావడం లేదు.. ఇక పెళ్లిళ్ల మాట దేవుడెరుగు..ఎప్పుడు కరోనా తమను అటాక్ చేస్తుందో అనే ప్రాణభయంతో ప్రజలు బతుకుతున్నారు. తమ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని జీవిస్తున్నారు. బయటికి వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఇలా ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకువచ్చింది కరోనా..కాని ఇవే పరిస్థితులు ఓ
పెళ్లి జంటను ఒకటి చేశాయి. కరోనా ప్రభావం ఒకవైపు విజృంభిస్తున్న కూడా మనసులు కలిసిన వేళ అవి మాకు లెక్క లోకి రావని ఓ జంట నిరూపించింది.
విషయానికి వస్తే..కరోనా సోకడం
పెళ్లి కూతురు పీపీఈ కిట్లు
పెళ్లి వస్త్రాలు అయ్యాయి.. ఈ ఘటన కేరళలో వెలుగు చూసింది.. కైనకారి ప్రాంతానికి చెందిన
శరత్ మోన్,
అభిరామి ఇరువురు ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ
పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఇరు కుటుంబాలకు ఒప్పించి
పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు.. కానీ, వారి ఆశల పై కరోనా నీళ్ళు చల్లింది. అయిన ఒకరిపై మరొకరికి ఉన్న నమ్మకమే వారికి
పెళ్లి జరిగేలా చేసింది. వైద్య అధికారులను , ఆసుపత్రి సిబ్బందిని ఒప్పించారు. దీంతో ఏకంగా ఈ పెళ్లికి
జిల్లా కలెక్టర్ కూడ హజరైనట్టు తెలుస్తోంది. కరోనా రోగులే బంధువులు అయ్యి వారి పెళ్లిని జరిపించారు. పట్టు చీర కట్టాల్సిన
పెళ్లి కూతురు పీపీఈ కిట్టు వేసుకుంది.. ఇక పెళ్లికోడుకు సైతం సాధరణ బట్టలతోనే ఉన్నాడు. ఈ
పెళ్లి వైరల్ అయ్యింది. నెటిజన్లు కూడా ప్రశంసలు కురిపించారు. ఈ
పెళ్లి ఫోటోలు సోషల్
మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి..