ఇకపోతే.. కొందరు బిర్యానీ అంటే ప్రాణం పెట్టేస్తారు. మరికొందరు వారానికోసారైనా కేఎఫ్‌సీ చికెన్ తినాల్సిందే అంటారు. ఇంకొందరు ఉదయం టిఫిన్ అంటే ప్రతిరోజూ దోసె ఉన్నా తినేంత ఇష్టం అంటారు. అలాగే స్వీట్లు, సమోసా... ఇలా ఒక్కొక్కరూ ఇష్టంగా తినే రుచులు కొన్ని ఉంటాయి.పుట్టినరోజు, పెళ్లిరోజు, లేదూ ఇంకేదైనా వేడుక చేస్తున్నప్పుడు వారికి నచ్చిన వంటకంలానే ఉండే కేకుని ఎదురుగా పెడితే ఎంత ఆశ్చర్యపోతారో, ఇంకెంత సంబరపడిపోతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక, అచ్చం ఆయా వంటకాల్లా ఉన్న కేకుల్ని చూస్తే 'ఇది కేకా..?' అని అవాక్కవడం అతిథుల వంతు.
అందుకే, ఈ తరహా బిర్యానీ, నూడిల్స్, ఇడ్లీ, రక రకాల వంటలను పోలిన కేకులని తయారు చేస్తున్నారు.. వాడికి డిమాండ్ కూడా బాగానే ఉంటుంది. హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా నిపుణులైన బేకర్స్ ఈ తరహా కేకుల్ని తయారు చేస్తున్నారు. దీనికోసం ముందుగా కేకుని కావాల్సిన ఆకారంలో చేసి దానిమీద ఐసింగ్‌తోనే ఈ రూపాలన్నిటినీ కనపడేలా తయారు చేస్తున్నారు.బిర్యానీ మెతుకుల్నీ విడిగా చేస్తారు. చికెన్ లెగ్‌పీస్‌లనూ, జీడిపప్పూ ఉల్లిపాయలాంటి వాటినీ పంచదార పేస్టుతోనే చేసి, ఆపైన ఎడిబుల్ రంగులతో అవి సహజమైన వాటిలా కనిపించేలా రంగులద్దుతారు.. మొత్తానికి ఈ కేకులు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.. ఎంతగా ఆ కేసులు ఆకర్షిస్తున్నాయి అనేది ఈ ఫొటోలో ఒకసారి చూడండి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి