ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులు నమోదు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా దూకుడుగా ముందుకు వెళ్తున్నది. వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడు మీద అలాగే ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు మీద ఏదో ఒక రూపంలో కేసులు నమోదు చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న విషయం స్పష్టంగా చెప్పవచ్చు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఇబ్బంది పడుతున్న క్రమంలో ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు కొంత మంది వైసీపీ నాయకులు కేసులు నమోదు చేస్తున్నారు.

తాజాగా గుంటూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు పై కేసు నమోదు చేశారు. మొన్న కర్నూలు జిల్లాలో కూడా చంద్రబాబు నాయుడు పై కేసు నమోదు చేశారు. కరోనా వైరస్ కు సంబంధించి తప్పుడు సమాచారాన్ని చంద్రబాబునాయుడు వ్యాప్తి చేస్తున్నారు అనే కారణంతో ఆయనపై కేసు నమోదు చేశారు. ఇక భవిష్యత్తులో కూడా మరిన్ని కేసులు చంద్రబాబు నాయుడు టార్గెట్గా నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. వాస్తవానికి చంద్రబాబు నాయుడు చెప్పిన సమాచారాన్ని సిసిఎంబి శాస్త్రవేత్తలు కూడా చెప్పిన సంగతి తెలిసిందే.

అయినా సరే చంద్రబాబు నాయుడు ని టార్గెట్ గా చేసుకుని కేసు నమోదు చేయడానికి ప్రధాన కారణం ఏంటనేది అర్థం కావడం లేదు. అయితే ఇటువంటి కేసులు ద్వారా వైసీపీ కార్యకర్తలలో కూడా ముఖ్యమంత్రి చులకన అయ్యే అవకాశం ఉందని వైసీపీ నాయకులు కూడా ఇటువంటి వాటిని సీరియస్ గా తీసుకునే అవకాశం ఉండకపోవచ్చని చంద్రబాబు నాయుడు అరెస్టు చేయాలనే లక్ష్యం ముఖ్యమంత్రి జగన్ ను ఎక్కువగా ఉందని అంటున్నారు. కానీ ఇప్పటివరకు అది సాధ్యం కాకపోవడంతో ఈ విధంగా అర్థంలేని కేసులు కూడా నమోదు చేస్తున్నారని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. రాజకీయంగా చంద్రబాబు నాయుడును ఎదుర్కోవడానికి కేసులను అడ్డంపెట్టుకుని ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: