ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం మళ్లీ ఊపందుకుంటోంది. కొన్ని నెలల క్రితం తగ్గిన కరోనా వ్యాప్తి ఈ మధ్య మళ్లీ పెరిగింది. లెక్కకు మించి కేసులు నమోదు అవుతున్నాయి. అలాగే రికవరీ రేటు పక్కన పెడితే, మరణాల సంఖ్య మాత్రం జనాలకు చెమటలు పట్టిస్తుంది.. ఒకవైపు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన కూడా కేసులు పెరుగుతుండటం ఆందోళన కర విషయమే.. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కరోనా నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ ను విధించారు. మరి కొన్ని రాష్ట్రాల్లో కర్ఫ్యూ విధించారు. 

కరోనా బాధితులకు సాయంగా ఉండేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. దేశంలో ఆక్సిజన్ కొరత ఎక్కువగా ఉన్న నేపథ్యం లో రోగులకు ఈ కొరతను అధిగమించేందుకు తోచిన సాయాన్ని అందించారు. ఇక కరోనా పై అవగాహన కల్పించేందుకు పోలీసులు విస్తృత ప్రచారం చేస్తున్నారు.. హైదరాబాద్ పోలీసుల ప్రయోగాలు మాములుగా లేవని చెప్పాలి.. కరోనా పై జాగ్రత్తలు తీసుకోవాలని రోడ్ల పై కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజలకు అన్నీ సేవలు అందుబాటులో ఉండేలా చూస్తున్నారు.


కరోనా బాధితులకు తెలంగాణ పోలీస్‌ శాఖ తరపున ఉచిత భోజనం అందిస్తున్నారు. ఇందుకోసం సికింద్రాబాద్‌ బోయినపల్లి సమీపంలోని శోభాగార్డెన్‌లో సేవా ఆహార్‌ పేరుతో ఏర్పాటు చేసిన సెంట్రల్‌ కిచెన్‌ను మహిళా భద్రతా విభాగం అడిషనల్‌ డీజీ స్వాతీ లక్రా, డీఐజీ సుమతి శనివారం పరిశీలించారు. నగరంలోని పలు స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ప్రతిరోజూ కనీసం రెండు వేల మందికి ఉచిత భోజనం అందిస్తున్నారు. లాక్‌డౌన్‌ లో కరోనా బాధితులు, బాధిత కుటుంబాలకు సవా భావంతో ఉచితంగా ఆహారాన్ని అందిస్తున్నామని స్వాతిలక్రా తెలిపారు. గాంధీ, ఉస్మానియా, కింగ్‌ కోఠి, నిమ్స్‌ తదితర ఆస్పత్రుల్లో పేషంట్లు వారి అటెండెంట్లకు ఈ ఉచిత భోజనాన్ని అందిస్తున్నామని డీఐజీ సుమతి వివరించారు... ఇలా చేయడం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: