టిడిపి అధినేత చంద్రబాబు పదునైన రాజకీయ ఎత్తులు వేయడంలో దిట్ట అన్నది అందరికి తెలిసిందే. ఇప్పటి వరకు ఎన్నో సార్లు రాజకీయంగా వ్యూహాత్మకంగా వ్యవహరించి  తనదైన రాజకీయ చతురతను చాటుకున్నారు చంద్రబాబు . కానీ కొన్ని కొన్ని సార్లు చంద్రబాబు వేసే ఎత్తులకు ఇతర పార్టీలకు చెక్ పెడుతూ ఉంటాయి. ఇక ఇప్పుడు కూడా ఇలాంటిదే జరిగింది. ఇటీవలే మహానాడు వేదికగా ఒక సరికొత్త వ్యూహనికి పదును పెట్టారు నారా చంద్రబాబు నాయుడు. కేంద్రంలో ఎన్డీయే నేతృత్వంలోని ప్రభుత్వానికి తాము అంశాల వారీగా మద్దతు ఇస్తామంటూ ఇటీవలే మహానాడు వేదికగా చంద్రబాబునాయుడు తీర్మానం చేశారు. ఇలాంటి తీర్మానం ద్వారా టిడిపి బిజెపి కలిసి ఉన్నాయి అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి.. ఇక ఆ తర్వాత  2024లో అటు బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేసే అవకాశం ఉంది అని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నించారు.



 కానీ బాబు వ్యూహనికి మొదట్లోనే అడ్డుకట్ట పడింది. ఏపీ బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ సునీల్ దియోధర్.. బాబు వ్యాఖ్యలను ఖండిస్తూ అసలు విషయాన్ని స్పష్టం చేశారు. ఇటీవలే మహానాడులో చంద్రబాబు ఇచ్చిన తీర్మానం చూస్తూ ఉంటే 2024లో అటు టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేసే అవకాశం ఉంది అని ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు అన్నది స్పష్టంగా అర్థమవుతుందని... కానీ అది అవాస్తవమని.. బీజేపీ, టీడీపీ మధ్య ఎలాంటి సంబంధం లేదు అంటూ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి బీజేపీ ముందుకు సాగుతోంది అంటూ సునీల్ దియోధర్ స్పష్టం చేశారు.



 ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతుందని.. ఫ్యామిలీ పాలిటిక్స్ కు చెక్ పెట్టేందుకే తాము జనసేన తో కలిసి ముందుకు సాగుతున్నామని...  టీడీపీతో కలిసి పోటీ చేసే ఉద్దేశ్యం బీ జె పీ కి ఏమాత్రం లేదు అంటూ స్పష్టం చేశారు సునీల్ థియేటర్. టిడిపికి, బిజెపికి భవిష్యత్తులో కూడా ఎలాంటి సంబంధాలు ఉండవు అంటూ తేల్చి చెప్పారు. అయితే ఇలా బాబు వ్యూహనికి చెక్ పడిందనే చెప్పాలి. టిడిపి,బిజెపి కలిసి ముందుకు సాగుతున్నారు అని ప్రజల్లో ఒక భావన కలిగించేందుకు తన తీర్మానం తో ప్రయత్నించిన చంద్రబాబుకు సునీల్ దియోధర్ వ్యాఖ్యలతో  షాక్ తగిలింది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: