ఒకప్పుడు ఏదైనా ఆహారం కావాలి అనిపిస్తే ఎక్కడ ఉన్న హోటల్కి వెళ్లి తెచ్చుకునే వాళ్ళం... కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా ఇంట్లో హాయిగా కూర్చొని అర చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్ లో ఆర్డర్ చేస్తున్నాం.  ఇక మనకు కావలసిన ఆహారం కూడా డోర్ డెలివరీ అవుతుంది. దీంతో ఆహారం కోసం పెద్దగా కష్టపడాల్సిన పని లేకుండా పోతుంది. అయితే ప్రస్తుతం ఇలా ఫుడ్ డెలివరీ చేయడానికి ఎన్నో రకాల యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఇలా ఫుడ్ డెలివరీ బాయ్గా పని చేస్తూ ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. ఇక ఇలా ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చిన సమయంలో కొంతమంది డెలివరీ బాయ్స్ టిప్ అడగడం లాంటిది జరుగుతూ ఉంటాయి.


 డెలివరీ బాయ్స్ ఇలా టిప్ అడిగిన సమయంలో ఇక కస్టమర్ తమకు నచ్చిన కొంత మొత్తాన్ని డెలివరీ బాయ్ కి టిప్ గా అందిస్తూ వుంటారు. ఒకవేళ డబ్బులు లేకపోతే లేదు అని చెప్పేస్తూ ఉంటారు. ఇక మరికొంత మంది డెలివరీ బాయ్స్ కి ఊహించని టిప్ ఇచ్చి ఆశ్చర్య పరుస్తూ ఉంటారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఇటీవలే ఓ వ్యక్తి ఒక పిజ్జా ఆర్డర్ చేశాడు. ఈ క్రమంలోనే డెలివరీ డెలివరీ చేశాడు   ఇక తనకు టిప్ చెల్లించాలి అంటూ అడిగాడు డెలివరీ బాయ్. అయితే అప్పటికి కస్టమర్ దగ్గర డబ్బులు లేవు. దీంతో డెలివరీ బాయ్ కి ఊహించని టిప్ ఇచ్చాడు.  ఇక సదరు కస్టమర్ ఇచ్చిన టిప్ కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది.



 అమెరికాలోని పిజ్జా హట్ లో ఒక వ్యక్తి పిజ్జా ఆర్డర్ చేశాడు. అయితే కస్టమర్ ఇంటికి డెలివరీ బాయ్ పిజ్జా తెచ్చాడు. ఈ క్రమంలోనే టిప్ ఇవ్వాలని కస్టమర్ ను అడిగాడు. అయితే నా దగ్గర డబ్బులు లేవు అంటూ కస్టమర్ చెప్పాడు. ఈ క్రమంలోనే ఏం చేయాలో ఆ కస్టమర్కు అర్థం కాలేదు  ఇక వెంటనే పిజ్జా బాక్స్ ఓపెన్ చేసి అందులో ఒక ముక్క తీసుకో అంటూ డెలివరీ బాయ్ కి చెప్పాడు కస్టమర్. దీంతో డెలివరీ బాయ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇక ఆ తర్వాత షాక్ నుంచి తీరుకొని కస్టమర్ ఇచ్చిన ఆఫర్ స్వీకరించాడు. దాన్ని నుంచి ఒక ముక్కను తీసుకొని వెళ్ళిపోయాడు. ఇక ఈ దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది. నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: