లంచం లంచం లంచం... ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పని కావాలన్నా లంచం కావాల్సిందే. ఇక పని తొందరగా కావాలి అంటే ప్రభుత్వ అధికారుల చేయి తడపాల్సిందే. పైపైకి నిజాయితీ వ్యాఖ్యలు అదే టేబుల్ కింద చెయ్యి పెట్టి  లంచం రూపంలో నోట్ల కట్టలు. అయితే మొన్నటి వరకు కేవలం  లంచం తీసుకుంటున్న అధికారుల గురించి సినిమాల్లో చూశాం.  హీరోలు లంచం తీసుకుంటున్న అధికారులకు పట్టించడం లాంటివి చూశాం. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా నిజ జీవితంలో కూడా లంచం తీసుకుంటున్న అధికారులకు సంబంధించిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తూనే ఉన్నాయ్. ఏ పని కావాలన్నా ప్రభుత్వ అధికారులు లంచం తీసుకుంటున్నారు.



 అదేదో ప్రభుత్వం నుంచి జీతాలు లేకుండా కేవలం సమాజసేవ కోసం ప్రజల కోసం పని చేస్తున్నట్లు గా వ్యవహరిస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. ఓవైపు ప్రభుత్వం నుంచి భారీగా జీతాలు పొందుతూ ప్రజలకు నిజాయితీగా సేవ చేయాల్సింది పోయి ప్రజల నుంచి కూడా భారీగా లంచం రూపంలో డబ్బులు దండుకుంటున్నారు. దీంతో అడుగడుగునా జనాలు ప్రభుత్వ కార్యాలయంలో ఏదైనా పని కావాలి అంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రోజురోజుకు ఇలాంటి తరహా ఘటనలు పెరిగిపోతున్నాయి.



 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది  ఏకంగా ఎవరైనా లంచానికి మంచం వేసి జనాలను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటే . వాళ్ళను మందలించి అరెస్టు చేయాల్సిన పోలీసు అధికారులే ఇక్కడ లంచం డిమాండ్ చేసి నీచానికి ఒడిగట్టారు. అది కూడా ఎవరో కాదు అదే పోలీస్ స్టేషన్లో  పనిచేస్తున్న ఇక పోలీసు వృత్తికి చెందిన హోంగార్డు ను లంచం డిమాండ్ చేయడం సంచలనం గా మారిపోయింది. ఏపీ లోని గుంటూరు దిశా పోలీస్ స్టేషన్ లో ఘటన వెలుగులోకి వచ్చింది ఈ ఘటన.  ఎస్సై కానిస్టేబుల్ ఏకంగా హోంగార్డును లంచం డిమాండ్ చేశారు. ఇటీవల హోంగార్డు అతని భార్య కు సంబంధించిన వివాదం పోలీస్ స్టేషన్ వరకు వచ్చింది. అయితే ఈ కేసును హోంగార్డు వైపు వచ్చేలా చేయడానికి  లంచం డిమాండ్ చేశారు  దీంతో ఏకంగా హోంగార్డు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: