గతంలో గురుశిష్యులుగా ఉన్న ఓ ఇద్దరు నాయకులు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకోవడం కోసం గట్టిగానే పోరాడుతున్నారు. ప్రతిపక్షంలో ఉంటూ అధికార పార్టీలపై నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారు. అలా రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకోవడం కోసం కష్టపడుతున్న గురుశిష్యులు ఎవరో కాదు...ఒకరు టీడీపీ అధినేత చంద్రబాబు, మరొకరు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. చంద్రబాబు, రేవంత్ రెడ్డిల మధ్య ఉన్న అనుబంధం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వేరు వేరు పార్టీల్లో ఉన్నా కూడా, ఒకరి మంచి ఒకరు కోరుకుంటూ ముందుకెళ్లే మనస్తత్వం ఉన్న నాయకులు.

అయితే ఈ గురుశిష్యులు ఇప్పుడు తమ పార్టీలని అధికారంలోకి తీసుకురావడానికి తీవ్రంగా కష్టపడుతున్నారు. ఏపీలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబు, అధికారంలో ఉన్న జగన్‌పై ఏ స్థాయిలో పోరాటం చేస్తున్నారో అందరికీ తెలిసిందే. జగన్ ప్రభుత్వంపై నిత్యం విమర్శలు చేస్తూ, ఆయన తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ, పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళుతున్నారు.

ఇప్పటికే జగన్ దెబ్బకు టీడీపీ తీవ్ర కష్టాల్లో కూరుకుపోయింది. ఆ కష్టాల నుంచి పార్టీని గట్టెక్కించి నెక్స్ట్ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి, మళ్ళీ సీఎం పీఠంలో కూర్చోవాలని చంద్రబాబు చూస్తున్నారు. అటు తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  కూడా, అక్కడ అధికార టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ ఎలాగైనా కేసీఆర్‌ని గద్దె దింపి, కాంగ్రెస్‌ని అధికారంలోకి తీసుకురావాలని తీవ్రంగా కష్టపడుతున్నారు.

ఈ క్రమంలోనే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ, ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తూ, పార్టీని బలోపేతం చేస్తున్నారు. ఎలాగైనా కాంగ్రెస్‌ని బలోపేతం చేసి, నెక్స్ట్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ని ఓడించి, సోనియమ్మ రాజ్యం తీసుకు రావడానికి రేవంత్ కష్టపడుతున్నారు. ఇక అన్నీ అనుకూలించి కాంగ్రెస్ గెలిస్తే, రేవంత్‌కు సీఎం పీఠం దక్కే అవకాశాలు కూడా లేకపోలేదు. మొత్తానికైతే గురుశిష్యులు మళ్ళీ అధికారంలోకి రావడానికి బాగానే కష్టపడుతున్నారు. మరి ఈ ఇద్దరు నేతలకు నెక్స్ట్ సీఎం అయ్యే ఛాన్స్ ఉందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: