నకిలీ పత్రాలు సృష్టించి బ్యాంకుల నుంచి అనేక వందల కోట్ల రుణాలు తీసుకొని మోసం చేసిన డైరెక్టర్ ఉప్పలపాటి హిమబిందును ఇటీవలే ఈడీ అధికారులు అరెస్టు చేయడం హాట్ టాపిక్ గా మారిపోయింది   ఇటీవలే ఆమెను కార్యాలయంలో అదుపులోకి తీసుకున్నారు ఈడీ అధికారులు. 2018 నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతోంది అన్న విషయం తెలిసిందే. 2018లో అధికారులు విఎంసి సీస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై కేసు నమోదు చేశారు  దీనికి సంబంధించి ఇక సిబిఐ అధికారులు కొంత మీద విచారణ కూడా కొనసాగించారు. సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఇటీవలే ఈడీ అధికారులు రంగంలోకి దిగారు.



 ఈ క్రమంలోనే విఎంసి డైరెక్టర్ ఉప్పలపాటి హిమబిందూని ఈడీ అధికారులు అరెస్టు చేశారు  పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 539 కోట్లు.. ఎస్బిఐ, ఆంధ్ర, కార్పొరేట్ బ్యాంకుల నుంచి 1207 కోట్ల రూపాయలను రుణాలు తీసుకుంది విఎంసి డైరెక్టర్ ఉప్పలపాటి హిమబిందు. అయితే ఈ రుణాలు తీసుకోవడానికి పూర్తిగా నకిలీ పత్రాలు సృష్టించింది. ఇక ఈ రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకులో ఫిర్యాదుతో సీబీఐ  ఈ సంస్థ డైరెక్టర్ల పై కేసు నమోదు చేసింది. అయితే సీబీఐ విచారణ కొనసాగిస్తున్న సమయంలో  ఈ కంపెనీకి చెందిన ముగ్గురు డైరెక్టర్లు విచారణకు సహకరించక పోవడం గమనార్హం.



 ముగ్గురు డైరెక్టర్లలో అటు ఉప్పలపాటి హిమబిందు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల రంగంలోకి  దిగిన ఈడీ ఉప్పలపాటి హిమబిందు ని  అరెస్టు చేసింది. అంతేకాకుండా సిబిఐ విచారణకు సహకరించకుండా తప్పించుకుని తిరుగుతున్న మరో ఇద్దరు డైరెక్టర్లను వెంకటరామారావు, వెంకటరమణ కోసం లూకౌట్ నోటీసులు కూడా జారీ చేసింది. 2018 నుంచి బీఎస్ఎన్ఎల్ నుంచి రావలసిన బకాయిలు వస్తే ఇక రుణాలు మొత్తం చెల్లిస్తాము అంటూ సీబీఐ విచారణలో తెలిపారు డైరెక్టర్లు.  అయితే ఇలా సీబీఐ విచారణలో బీఎస్ఎన్ఎల్ నుంచి 262 కోట్లు రావాల్సి ఉంది అంటూ తెలిపి ఇక సిబిఐ విచారణ తప్పుదోవ పట్టించారు అంటూ ప్రస్తుతం సీబీఐ ఆరోపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: