తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. ప్రతి నెలా 20వ తేదీన తదుపరి నెల దర్శన టికెట్లను విడుదల చేసే తిరుమల తిరుపతి దేవస్థానం.. సెప్టెంబర్ నెలకోటా టికెట్లను రేపు ఉదయం తొమ్మిది గంటలకు విడుదల చేయనుంది. గతంలో రోజుకు 5వేల టికెట్లను విడుదల చేసిన టీటీడీ.. సెప్టెంబర్ నెల కోటాలో రోజుకు 8వేల టికెట్లను విడుదల చేయనుంది. కరోనా కారణంగా టికెట్ బుక్ చేసుకొని దర్శనం చేసుకోలేకపోయినా వారు ఈ ఏడాది చివరిలోగా ఎప్పుడైనా శ్రీవారిని దర్శించుకోవచ్చు.

శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేలా భక్తులకు టీటీడీ మహాభాగ్యం కలిగిస్తోంది. ఆన్ లైన్ లో శ్రీవారి టికెట్ ధర 300రూపాయలుగా ఉండనుంది. శ్రీవారిని దర్శించుకోవాలని ఆరాట పడే భక్తులు మంగళవారం ఉదయం 9గంటలకు రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని టీటీడీ అధికారులు ప్రకటించారు. ఇక గత ఆదివారం శ్రావణ పౌర్ణమి సందర్బంగా తిరుమల గిరిపై గరుడ సేవ వైభవోపేతంగా జరిగింది. శ్రీ మలయప్ప స్వామి వారు గరుత్మంతునిపై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారిని అలా చూసిన భక్తులు పులకించిపోయారు. ఓం నమో వేంకటేశాయ.. గోవిందా గోవిందా.. ఏడు కొండల వాడ వెంకటరమణ లాంటి స్త్రోత్రాలతో స్వామివారిని సన్నుతించారు. మొత్తానికి టీటీడీ అందించిన శుభవార్తతో.. భక్తుల్లో హర్షం వ్యక్తం చేస్తోంది.

మరోవైపు ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా డీఆర్ డీఓ తయారు చేసిన పర్యావరణ హిత సంచుల విక్రయ కేంద్రం తిరుమలలో ప్రారంభమైంది. లడ్డూ విక్రయ కేంద్రంలో ఈ కౌంటర్ ను టీటీడీ ఈవో జవహర్ రెడ్డితో కలిసి డీఆర్డీవో ఛైర్మన్ సతీశ్ రెడ్డి నిన్న ప్రారంభించారు. ఐదు లడ్డూలు పట్టే సంచి ధర 2రూపాయలు, 10లడ్డూలు పట్టే సంచి ధర 5రూపాయలుగా నిర్ణయించారు. ఈ బయోడిగ్రేడబుల్ సంచులను పశువులు తిన్నా ఎలాంటి హాని ఉండదని డీఆర్ డీఓ ఛైర్మన్ సతీశ్ రెడ్డి తెలిపారు.




మరింత సమాచారం తెలుసుకోండి: