దళిత బంధు  పథకం  అమలు పై మరో కీలక నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ సిఎం కెసిఆర్.  దళిత బంధు  పథకం అమలుకు సంభందించిన లోటు పాటులను, దళిత ప్రజల  మనో భావాలను, వారి అవసరాలను పూర్తి స్థాయిలో అర్థం  చేసు కోవాలని నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ  సిఎం కెసిఆర్.    దీని లో భాగం గానే .. తెలంగాణ రాష్ట్రం లోని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ  భాగాల్లో వున్నటు వంటి..   దళిత శాసన సభ్యులు ప్రాతి నిధ్యం వహిస్తున్న నాలుగు నియోజకవర్గాల్లోని 4 మండలా లను ఎంపిక చేసి..  ఆ మండలాల్లోనూ  అన్ని కుటుంబాలకు హుజూరాబాద్ తో పాటు దళిత బంధు ను ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకున్నారు  ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు.  

ఇందులో భాగం గానే .. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం లోని చింతకాని  మండలం, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజక వర్గం లోని  తిర్మలగిరి మండలం, నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లోని చారగొండ మండలం మరియు కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాం సాగర్ మండలాలను ఎంపిక చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు సిఎం కెసిఆర్. దీంతో ఈ నాలుగు  మండలా ల్లో వున్న అన్ని దళిత కుటుంబా లకు వెంటనే దళిత బంధు పథకాన్ని వర్తింప చేయనుంది తెలంగాణ సర్కార్.  

ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఆయా జిల్లాల మంత్రులు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యే లు జిల్లా కలెక్టర్ల తో హైద్రాబాద్ లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు తెలంగాణ సిఎం కెసిఆర్.  ఆ సమావేశంలో నిర్ణయాలు తీసుకుని ఈ నాలుగు మండలాల్లో దళితబంధు పథకాన్ని అమలు చేయనుంది కెసిఆర్ సర్కార్. కాగా హుజూరాబాద్ నియోజక వర్గం లో ఈ దళిత బంధు  పథకాన్ని ప్రారంభించారు సిఎం కెసిఆర్.  

మరింత సమాచారం తెలుసుకోండి: