దీంతో అధికార యంత్రాంగం మొత్తం ఒక్క సారిగా అప్రమత్తమైంది. దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్ర దాడులు జరగ వచ్చని ఇటీవలే ఇంటిలిజెన్స్ బ్యూరో నుంచి హెచ్చరికలు వచ్చాయి. ఈ హెచ్చరికల ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారి పోయాయ్. దీంతో ప్రస్తుతం ఢిల్లీలో ఎక్కడ చూసినా హాట్హాట్ వాతావరణం నెలకొంది. దీంతో ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. దేశ రాజధాని ఢిల్లీలో ఐఈడీ పేరుతో ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉంది అని ఇటీవలే ఇంటిలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది.
సెప్టెంబర్ ఆరో తేదీ నుంచి ఇజ్రాయిల్ పౌరులకు సెలవులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ క్రమం లోనే ఇజ్రాయిల్ పౌరులనె టార్గెట్ చేస్తూ అటు ఉగ్రవాదులు దాడులకు పాల్పడేందుకు సిద్ధమవుతున్నారు అనే హెచ్చరికలు వచ్చాయ్. ఈ క్రమంలోనే ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం, కాన్సులేట్ సిబ్బంది, కోషర్ రెస్టారెంట్, యూదుల కమ్యూనిటీ సెంటర్ దగ్గర ఈ నెలాఖరు వరకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తుంది. అయితే దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్ర దాడి జరుగుతుంది అని అటు ఇంటిలిజెన్స్ వర్గాలు సమాచారం అందించడం మాత్రం సంచలనంగా మారిపోయింది. ఇక ఢిల్లీలో ఏ క్షణంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది హాట్ టాపిక్ గా మారింది. .
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి