ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలు వ‌డుతున్నాయి. అధికారి వైసీపీ ఎక్క‌డా కూడా టీడీపీకి ఏ మాత్రం ఛాన్స్ లేకుండా వ‌న్ సైడ్‌గా విజ‌యాలు సాధిస్తోంది. రాష్ట్రం అంత‌టా వైసీపీ వాళ్లు సంబ‌రాలు చేసుకుంటున్నారు. ఇలాంటి స‌మ‌యంలో ఓ వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా చేస్తానంటూ పెద్ద బాంబు పేల్చారు. ఆ ఎమ్మెల్యే ఎవ‌రో కాదు .. కృష్ణా జిల్లా మైల‌వ‌రం ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్‌. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న అప్ప‌టి ఇరిగేష‌న్ మంత్రి దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర రావు పై భారీ మెజార్టీతో విజ‌యం సాధించారు. ఉమాను స‌వాల్ చేసి మ‌రీ ఓడించారు.

క‌ట్ చేస్తే స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీని స్వీప్ చేయించి ప‌డేశారు. నియోజ‌క‌వ‌ర్గం మొత్తం మీద టీడీపీ కి కేవ‌లం మూడు స‌ర్పంచ్ స్థానాలు మాత్ర‌మే వ‌చ్చాయి. ఇక తాజాగా జ‌డ్పీ ఎన్నిక‌ల్లోనూ అక్క‌డ వైసీపీ జోరు ముందు ఉమా పూర్తిగా చేతులు ఎత్తేశారు. గ‌త ఎన్నిక‌ల్లో ఉమాకు ఏకంగా 3 వేల ఓట్ల మెజార్టీ వ‌చ్చిన గొల్ల‌పూడిలో ఈ రోజు 10 ఎంపీటీసీల‌కు 10 టీసీలు వైసీపీ ఖాతాలోనే ప‌డ్డాయి. అయితే ఈ ఫ‌లితాలు వెలువ‌డుతోన్న వేళ వ‌సంత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

రాజ‌ధాని అమ‌రావ‌తిని ఇక్క‌డ నుంచి త‌ర‌లిస్తార‌న్న వార్త‌ల నేప‌థ్యంలో ఆయ‌న మాట్లాడారు. రాజ‌ధాని ఇక్క‌డే ఉంటుంద‌ని.. ఇక్క‌డ నుంచి రాజ‌ధానిని త‌ర‌లిస్తే తాను రాజీనామా చేస్తాన‌ని.. అదే రాజ‌ధాని ఇక్క‌డే ఉంటే మాజీ మంత్రి దేవినేని ఉమా రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటారా ? అని ఆయ‌న స‌వాల్ చేశారు. ఉమా అన‌వ‌స‌ర‌పు ఆరోప‌ణ‌లు చేయ‌డం కంటే త‌న స‌వాల్‌ను స్వీక‌రించాల‌ని ఆయ‌న అన్నారు. ఏదేమైనా రాజ‌ధాని త‌ర‌లింపుపై వైసీపీ నేత‌లే త‌లో ర‌కంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇవి చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.  మ‌రి వ‌సంల చేసిన వ్యాఖ్య‌ల‌పై వైసీపీలో ఇత‌ర ప్రాంతాల నాయ‌కులు ఎలా ?  స్పందిస్తారో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: