తెలంగాణ రాజకీయాల్లో వైట్ వార్ సంచలనం రేపుతోంది. మంత్రి కేటీఆర్ కు డ్రగ్స్ వ్యవహారంతో లింకులు ఉన్నాయని, విచారణ జరపాలని ఏఐసిసి అధినేత జడ్సన్ ఈడికి ఫిర్యాదు చేయడం ఇటీవల చాలా కలకలం రేపింది. ఈ ఫిర్యాదుపై మంత్రి కేటీఆర్ కూడా ఘాటుగా స్పందించారు. మాదక ద్రవ్యాలతో తనకేం సంబంధం అని ఎవడో పిచ్చోడు ఫిర్యాదు చేశారంటూ,  తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత జడ్సన్ తీవ్రంగా మండిపడ్డారు. నన్ను పిచ్చోడు అంటాడు అని ఓ రేంజ్ లో ఫైర్ పోయాడు. ఇదిలా ఉండగా ఈ పక్క జడ్సన్ మరోసారి సంచలనానికి తెరలేపారు. కవిత ఆస్తులపై విచారణ జరిపించాలని కోరుతూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు జడ్చర్ల ఫిర్యాదు చేశాడు.

హైదరాబాద్లోని జాయింట్ డైరెక్టర్ కు ఆయన లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేశారు. కవిత 2014లో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన అప్పటి నుంచి ఆమె యొక్క స్థిరఆస్తులు, కిరాతులు కంపెనీలో పెట్టుబడులు భారీగా పెరిగిపోయాయని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి నటువంటి వివరాలను ఆయన ఈడీకి సమర్పించారు. కవిత భర్తకు ఉన్నటువంటి పెట్టుబడులు, వివిధ కంపెనీల్లో ఉన్నటువంటి పదవుల వివరాలను అందించారు. ఏడు సంవత్సరాలలో ఎక్కడెక్కడ ఎంతెంత వ్యవసాయ భూములు, నివాస గృహము లు కొనుగోలు చేశారో ప్రస్తుత భూములకు మార్కెట్ విలువ ఎంత ఉందో ఆ ఫిర్యాదుకు జతచేసి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కేవలం తెలంగాణ జాగృతి సంస్థ కు మాత్రమే కవిత ప్రజలకు పరిచయం అని, తన తండ్రి ముఖ్యమంత్రి అయ్యాక ఆయన అడ్డుపెట్టుకొని కోట్లాది రూపాయల సంపాదించుకున్నారని ఆ ఫిర్యాదులోపేర్కొన్నారు.

ఇది దీనిపై సమగ్ర విచారణ జరిపితే కవిత గ్రామస్తులు బయటకు వస్తాయని జడ్సన్ తెలిపారు. దీనికి సంబంధించి జూలై 10వ తేదీన ఇడికి ఫిర్యాదు చేసిన ఎలాంటి స్పందన లేదని, దీంతో మరోసారి ఫిర్యాదు చేస్తున్నట్లు జడ్సన్ తెలియజేశారు. మాదక ద్రవ్యాల కేసులో కేటీఆర్ సంబంధం ఉందంటూ నాలుగు రోజుల క్రితమే ఫిర్యాదు చేసినా జడ్సన్, మళ్లీ కవితను టార్గెట్ చేయడం సంచలనం రేపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: