రైతు ఉద్యమానికి ప్రపంచంలోని వివిధ దేశాల్లో ప్రవాస భారతీయులు, ఇతర దేశాల రైతులు, రైతు సంఘాల నుంచి మద్దతు, సంఘీభావం కూడా వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో అక్కడ వాషింగ్టన్ డిసిలో వైట్ హౌస్ ఎదుట ప్రవాస భారతీయులు ఆందోళన చేపట్టారు. మేము రైతులను ఆదుకుంటాము, రైతు లేకపోతే, ఆహారం లేదు, జై జవాన్, జై కిసాన్, భారతదేశం రైతులను అణచివేస్తుంది. వంటి  ప్లకార్డులను చేబూని నినాదాలతో హోరెత్తించారు.  అలాగే ప్రధాని మోడీ అమెరికా పర్యటన సందర్భంగా నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల్లో కూడా రైతుల మద్దతుదారులు జెండాలతో హాజరయ్యారు. న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితిలో భవనం దగ్గర నిరసనలు చేపట్టారు. నిరసన తెలుపుతున్న రైతులకు మద్దతుగా కాలిఫోర్నియాలోని  శాక్రమెంటోలో కిసాన్ కార్ ర్యాలీ నిర్వహించారు.

ఇంగ్లాండ్ లోని లండన్, బర్మింగ్ హమ్ , డబ్లిన్, గ్లాస్గోలలో సంఘీభావ నిరసనలు చేపట్టారు. ఐర్లాండ్ లోని డబ్లిన్ లో జరిగిన నిరసనతో పాటు, కెనడాలోని టొరంటోలో రైతులకు మద్దతుగా సంఘీభావ యాత్ర జరిగింది. ఎస్ కే ఎం పిలుపునిచ్చిన సెప్టెంబర్ 27 భారత్ బంద్ కు మరింత మద్దతు లభిస్తుంది. బంద్ పిలుపుకు వామపక్ష పార్టీలు తమ మద్దతును ఇప్పటికే అందించాయి. ఆర్ జె డి,  ఎస్ సి పి, జేఎంఎం, టిడిపి, డీఎంకే  తదితర పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. రైతులకు మద్దతుగా కేరళలో అధికారం ఎల్ డి ఎఫ్ హర్థాల్ కు పిలుపు ఇచ్చింది. భారత్ బంద్ కు  మద్దతు కూడగట్టడానికి గురుగ్రామ్, పాల్వాల్  లో కాగడాల ప్రదర్శన జరిగింది. జార్ఖండ్ లో కార్మిక సంఘాలు బంద్ రోజున బొగ్గు రవాణా ను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. భారత్ బంద్ కు మద్దతుగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ప్రకటన విడుదల చేసింది.

బీహార్ లోని కోసి  నవనిర్మాణ మంచ్ భారత్ బంద్ కు మద్దతు ప్రకటించింది. పంజాబ్, హర్యానా ప్రైవేట్ స్కూల్ సంఘం, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ల సమాఖ్య  భారత్ బంద్ రోజున ప్రైవేట్ పాఠశాలలు మూసివేస్తామని ప్రకటించాయి. వివిధ పట్టణాల్లోని బార్లు కూడా సెప్టెంబర్ 27న పని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. దేశవ్యాప్తంగా ప్రతిచోట బంద్ పిలుపును విజయవంతం చేయడానికి  తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేవలం పంజాబ్ లో ఇంటలిజెన్స్  నివేదికల ప్రకారం 320 కి పైగా ప్రదేశాల్లో చక్కా జామ్ జరుగుతాయని , డజన్ల ప్రదేశాల్లో రైల్ రోకోలు జరుగుతాయని సూచిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: