తెలంగాణ‌లో వైఎస్ ష‌ర్మిల కొత్త పార్టీ ఎంత వ‌ర‌కు ప్ర‌భావం చూపుతుంది ? అన్న ది ఇప్పుడు అక్క‌డ పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి సోద‌రి అయిన ష‌ర్మిల స‌మైక్యాంధ్ర రాజ‌కీయాల్లో నాలుగు ద‌శాబ్దాల పాటు ఓ వెలుగు వెలిగిన దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్సా ఆర్ కుమార్తె అన్న విష‌యం తెలిసిందే. ఎంత కాద‌న్నా వైఎస్ ప్ర‌భావం ఇప్ప‌ట‌కీ తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌పై ఉంది. పైగా ఏపీలో ఆయ‌న ఛ‌రిష్మా ఎంతో కొంత జ‌గ‌న్ కు ఉప‌యోగ ప‌డింది. అందుకే ఆయ‌న పార్టీ పెట్టిన త‌క్కువ టైంలోనే ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డంతో పాటు సీఎం అయ్యారు.

ఇక తెలంగాణ‌కు ముందు నుంచి వైఎస్ వ్య‌తిరేకి అన్న విష‌యం తెలిసిందే. అలాంటి గ‌డ్డ‌పై ఆయ‌న కుమార్తెగా ష‌ర్మిల ఎంత వ‌ర‌కు రాజ‌కీయాల్లో నెగ్గుకు వ‌స్తారు ? అన్న‌దే చెప్పాలి. ఇక ఇప్పుడు తెలంగాణ గ‌డ్డ‌పై షర్మిల పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళితే ఎవరికి లాభం? ఎవరికి నష్టం అన్న దానిపై ఎవ‌రి లెక్క‌ల్లో వారు మునిగి తేలుతున్నారు. ష‌ర్మిల పార్టీ ముఖ్యంగా ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా తో పాటు ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా గ్రేట‌ర్ హైద‌రాబాద్ లాంటి చోట్ల ఎంతో కొంత ప్ర‌భావం అయితే చూపుతుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు లెక్క‌లు క‌డుతున్నాయి.

అంతిమంగా ఎవ‌రు న‌ష్ట‌పోయినా.. ఎవ‌రు లాభ ప‌డినా కూడా ష‌ర్మిల పార్టీ తెలంగాణ లో బ‌ల‌ప‌డితే ముందుగా ఆ ఎఫెక్ట్ విప‌క్ష కాంగ్రెస్ మీదే ఉంటుంద‌ని అంటున్నారు. ష‌ర్మిల పార్టీ రెడ్ల ఓట్ల‌నే ఎక్కువుగా చీల్చు తుంద‌ని అంటున్నారు. ఇక ఎస్సీ, ఎస్టీ వ‌ర్గాలు కాంగ్రెస్ కు ముందు నుంచి సంప్ర‌దాయ ఓటు బ్యాంకుగా ఉంటూ వ‌స్తున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో ఈ రెండు వ‌ర్గాల ఓట్ల‌ను ష‌ర్మిల ఎంతో కొంత చీల్చితే అది కాంగ్రెస్‌కే న‌ష్టం అన‌డంలో సందేహం లేదు.

ఇక తెలంగాణ లో త్వ‌ర‌లోనే ష‌ర్మిల పాద‌యాత్ర ప్రారంభం కానుంది. ఆమె యేడాది పాటు మొత్తం 90 నియోజ‌క‌వ‌ర్గాల్లో పాద‌యాత్ర‌కు రెడీ అవుతున్నారు. ఎంతైనా ఆ యాత్ర ప్ర‌భావం ఉంటుంది. ఏదేమైనా ఎలా చూసినా కూడా ష‌ర్మిల పార్టీ బ‌ల‌ప‌డితే అది గులాబీ పార్టీ, బీజేపీ కంటే కాంగ్రెస్‌కే న‌ష్టం అయ్యేలా క‌నిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: