ప్రస్తుతం ఏపీ రాజకీయాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వేడిగా కొనసాగుతున్నాయి. ఇటీవలే జగన్ పై టీడీపీ నేత పట్టాభి బూతులు మాట్లాడటం.. వెంటనే వైసీపీ శ్రేణులు టిడిపి కార్యాలయం పై దాడి చేయడంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు వాడివేడిగా మారిపోయాయ్. ఈ క్రమంలోనే ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్నది కూడా ఊహకందని విధంగా ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల చిత్తూరులోని కుప్పం లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సీఎం జగన్ ను బూతులు తిట్టడానికి నిరసనగా ప్రజాగ్రహం దీక్ష చేపడుతున్నారని వైసీపీ శ్రేణులు.


 ఈ క్రమంలోనే తాము కూడా చంద్రబాబు నాయుడు పై బూతు పురాణం వల్లించి ఆయన వాహనాలపై బాంబులు పెట్టి పేల్చేస్తాము అంటూ వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతలో అటు వైపుగా వైసీపీ పై టీడీపీ శ్రేణులు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లేందుకు ప్రయత్నించారు. కాగా అక్కడే జనాగ్రహ దీక్షలో ఉన్న వైసీపీ శ్రేణులు తమ ఆందోళన కార్యక్రమం పూర్తయిన తర్వాతనే తాము వాహనాలు వెళ్లేందుకు అనుమతి ఇస్తామని.. అప్పుడు వెళ్లి ఫిర్యాదు చేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో రోడ్డుపై ఇరువర్గాల మధ్య బాహాబాహీ జరిగింది. ఇటీవలే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై రెస్కో చైర్మన్ చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేయడానికి టీడీపీ శ్రేణులు పోలీస్ స్టేషన్ కు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే  పోలీసులు అడ్డుకోవడంతో టీడీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఇక భారీగా టీడీపీ శ్రేణులు రోడ్డుపైకి రావడంతో దీక్ష చేస్తున్న వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా టిడిపి శ్రేణులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితులు చేయి దాటి పోతున్నాయి అని గమనించిన పోలీసులు భారీగా పోలీసులను మోహరించారు. టీడీపీ శ్రేణుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి ఇరువర్గాలకు నచ్చజెప్పారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ap