
ఆ ఎన్నికల్లో టీఆర్ ఎస్ ఏకంగా 88 సీట్లలో విజయం సాధించినా కూడా చాలా చోట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. వారి ఓటమికి ఈ చపాతీ రోలర్ కారణమైంది. ఆ గుర్తు నుంచి పోటీ చేసిన ఇండిపెండెంట్లు భారీ స్థాయిలో ఓట్లు చీల్చి పరోక్షంగా కారు పార్టీ అభ్యర్థుల ఓటమి కి కారణమయ్యారు.
దుబ్బాక ఉప ఎన్నికల లో నూ చపాతీ రోలర్.. కారును ఓడించడానికి కొంత వరకు కారణమైంది. ఇప్పుడు హుజూరా బాద్ బై పోల్ లో కూడా అదే గుర్తు కారు పార్టీని , ఆ పార్టీ నేతలను తెగ టెన్షన్ పెట్టేస్తోందట. హుజూరాబాద్ బై పోల్ లో ప్రజా ఏక్తా పార్టీ అభ్యర్థి సిలివేరు శ్రీకాంత్ పోటీలో చేస్తున్నారు. ఎన్నికల సంఘం ఆయనకు చపాతీ రోలర్ గుర్తు ను కేటాయించింది. అయితే ఇది కారు గుర్తును పోలి ఉంది.
కారుకు ఓట్లే యాలని అనుకున్న వారు .. ముఖ్యంగా వృద్ధులు చపాతీ రోలర్ కు ఓట్లు వేస్తే అది కారు పార్టీకి వచ్చే ఓట్ల పై తీవ్రమై న ప్రభావం చూపుతుంది. అప్పుడు టీఆర్ ఎస్ ఇబ్బంది పడక తప్పదు. ఇక ఈ గుర్తుపై ముందు నుంచి టీఆర్ ఎస్ పోరాటం చేస్తూనే ఉంది. అయితే ఎన్నికల సంఘం మాత్రం దీనిని ఇండిపెండెంట్లకు కేటాయిస్తూనే వస్తోంది.