ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద పోలీస్ అధికారి  సక్రు నాయక్ అనుమానితునిగా భావించి  దాడి చేసిన విష‌యం విధిత‌మే. టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారాలోకేష్ ఏ1, ఎమ్మెల్సీ ఆశోక్ బాబు ఏ2,  మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఏ3, తాడికొండ మాజీ ఎమ్మెల్యే  తెనాలి శ్రావణ్ కుమార్ఏ4, 5గా గుంటూరు పార్లమెంట్ టీడీపీ జిల్లా కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు ,  నాదెండ్ల బ్రహ్మంను ఏ6గా నమోదు చేశారు.

అక్టోబ‌ర్ 20న సక్రు నాయక్ టీడీపీ  కార్యాలయంలో జరిగిన ఘటనపై మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. మంగళగిరి రూరల్ ఎస్ఐ సుంకర లోకేష్  ఎఫ్ఐఆర్  నెం 651/2021,  ఎస్సీ ఎస్టీ అట్రాసీటీ, హత్యాయత్నం కేసు నమోదు చేశారు. సెక్షన్లు 147, 148, 307, 332, 427, 323, 324, 342 ఆర్ /డబ్ల్యూ 149, 39(1)(ఆర్),  3(10(ఎస్)ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పీఓఏ యాక్ట్ పై కేసు న‌మోదు చేశారు.

తాజాగా ఈ కేసును విచార‌ణ చేప‌ట్టిన హై కోర్టు.. టీడీపీ కార్యాల‌యం విధ్వంసం సృష్టించిన సంద‌ర్భంలో అక్క‌డికి వ‌చ్చిన వ‌చ్చిన రిజ‌ర్వ్ ఇన్‌స్పెక్ట‌ర్ స‌క్రునాయ‌క్‌పై దాడి కేసులో నిందితుల‌కు 41 ఏ నోటీసులు ఇవ్వాల‌ని హైకోర్టు ఆదేశించింది.  అదేవిధంగా 41ఏ సెక్ష‌న్ ప్ర‌కారం.. 41 ఏ సెక్షన్ ప్రకారం నోటీసులిచ్చి విచారణ జరపాలని  మంగళగిరి పోలీసులను  హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఎమ్మెల్సీ అశోక్ బాబు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, తెనాలి శ్రావణ్ కుమార్, పోతినేని శ్రీనివాసరావు పై కులం పేరుతో దూషించారని కేసు నమోదు అయింది. గంజి చిరంజీవి, మరో పది మంది రాస్తారోకో చేశారని వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదుపై నమోదు చేసిన  కేసులో కూడా 41 ఈ నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.  ఈ కేసుల్లో పిటిషనర్ల తరఫున  సీనియర్ న్యాయవాది మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్  వినిపించారు.  ప్రభుత్వానికి కేసుల్లో కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.






మరింత సమాచారం తెలుసుకోండి: