ప్రజలు కోరుకున్న నేత, ప్రజల గుండె చప్పుడు విని పరిపాలన సాగిస్తున్న నాయకుడు ప్రస్తుత ఏపి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రకు, ప్రజా సంకల్ప యాత్రకు నేటితో అనగా శనివారంతో నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. దాదాపు ఓ ఏడాది మొత్తం తన కాలాన్ని పూర్తిగా ప్రజల యోగ క్షేమాలు తెలుసు కోవడానికి పాదయాత్రకే అంకితం చేసి...బడుగు బలహీన వర్గాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ప్రజల వద్దకు పయణించి వారి బ్రతుకుల్లో భాగమవుతూ అన్నిటినీ దగ్గరుండి గమనిస్తూ ఒక్కో సమస్యను తన మనసులో వేసుకుంటూ ముందుకు నడిచారు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి. నవంబరు 6, 2017 ఇడుపులపాయ వద్ద మొదలయిన ఆయన పాదయాత్ర పయనం జనవరి 9, 2019 శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద ముగించారు.

పద్నాలుగు నెలల పాటు నిర్విరామంగా పాదయాత్రతో ప్రజలతో కష్ట నష్టాలను తెలుసుకోవడంలో మునిగిపోయారు. సమస్య తెలుసుకోవడం వేరే సమస్యను అర్దం చేసుకోవడం వేరే అని నమ్మిన  వైఎస్ జగన్ ప్రజల కష్టాలను అర్దం చేసుకున్నాడు ప్రతి కష్టాన్ని తన మనసుతో విన్నాడు అందుకే నేడు వారి ఒక్కో సమస్యని పరిష్కరిస్తూ అంత అద్భుతంగా పారదర్శక పరిపాలనను కొనసాగిస్తున్నారు. పాదయాత్రలో మొత్తం 13 జిల్లాలను చుట్టేసిన వైయస్ జగన్ ఏ ఒక్క ప్రాంతాన్ని విడిచి పెట్టలేదు. 134 నియోజక వర్గాలు, 231 మండలాలు, 2516 గ్రామాల్లో పాదయాత్రతో ప్రజలతో పయనించి వారి గోడును విన్నారు. నేడు వారి కష్టాలను దూరం చేసే సరి కొత్త పథకాలతో, నూతన ఆవిష్కరణలతో ప్రజల సమస్యలను ఒక్కొక్కటిగా దూరం చేస్తున్నారు.  అమ్మ ఒడి, రైత భరోసా, మహిళ సాధికారిత, విద్య దీవెన ఇలా పుట్టిన బిడ్డ నుండి పండు ముసలి వారి వరకు ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా వారి జీవితంలో కొత్త వెలుగులు విరజిమ్మేలా నిర్ణయాలను తీసుకుంటూ నాయకుడు అంటే ఇలా ఉండాలి ఇలానే ఉండాలి అని ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఆయన పాదయాత్ర చేసే సమయంలో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలవడమే కాదు. మొత్తం 8 కార్పొరేషన్లలో ప్రత్యేకంగా 124 సభలను,సమావేశాలను ఏర్పాటు చేసి ప్రజలకు మాట్లాడే అవకాశాన్ని కల్పించి వారి ఆశలను, ఆశయాలను తన మనసుతో విన్నాడు. 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వైఎస్ జగన్, ప్రతి అడుగు వేస్తూ వేలాది మంది ప్రజల గుండె చప్పుడును తన హృదయం తో విని చలించిపోయారు. ఇపుడు స్పందిస్తూ ఆ సుదీర్ఘ  ప్రయాణానికి ఫలితాన్ని మన ముందు ఉంచారు మహానేత మన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: