ఈ క్రమంలోనే అక్కడి మహిళలను కట్టు బానిసలుగా చూస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. కనీసం మహిళలు ఉద్యోగం చేయడానికి కూడా అవకాశం లేదు అంటూ కఠినమైన ఆంక్షలు విధిస్తున్నారు. తాలిబన్లు ఆధిపత్యంలోకి రావడంతో మహిళల క్రీడలు కాస్తఅంధకారంలో మునిగిపోయాయి. పురుషుల క్రీడలకు అనుమతి ఇచ్చినప్పటికీ మహిళ క్రీడలకు మాత్రం అనుమతి లేదంటూ స్పష్టం చేశారు. ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం వివిధ దేశాల క్రికెట్ బోర్డులు ఆఫ్ఘనిస్తాన్కు ఊహించని షాక్ ఇస్తున్నాయి.
మరికొన్ని రోజుల్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించాల్సి ఉంది. కానీ ఆఫ్ఘనిస్తాన్లో లింగ వివక్షను సహించబోమని మహిళల జట్టుకు కూడా అనుమతి వచ్చినప్పుడే పురుషుల జట్టు కు తమ దేశంలో పర్యటనకు అనుమతి ఇస్తాము అంటూ పర్యటనను రద్దు చేసుకుంది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. ఇది కాస్త సంచలనంగా మారిపోయింది. అయితేతాలిబన్ల పాలనలో ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో ఎంతో ప్రతిభగల క్రీడాకారులను గా ఉన్న వారిని దారుణంగా హత్య చేసిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.ఇలాంటి నేపథ్యంలో అటు పురుషుల క్రీడలకు కూడా ఆటంకం ఏర్పడుతున్నా నేపథ్యంలో రానున్న రోజుల్లో తాలిబన్లు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రపంచ దేశాలు ఇలాగే ఒత్తిడి తెస్తే అటు మహిళల క్రీడలకు కూడా అనుమతి ఇచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి