రాష్ట్రంలో పత్తి సాగు భారీగా పెరిగిన అకాల వర్షాలు దిగుబడిపై ప్రభావం చూపించాయి. పత్తి మార్కెట్ కు తీసుకు వస్తే తేమ ఎక్కువగా ఉందని మార్కెట్ వర్గాలు వెనక్కి పంపుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ రాష్ట్రవ్యాప్తంగా 306 పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే..8 శాతం లోపు తేమ ఉన్న పత్తికే పూర్తి మద్దతు ధర చెల్లిస్తోంది. ఆపై తేమ  శాతం ఉంటే క్వింటాలుకు 10 శాతం కోత విధిస్తోంది. 12 శాతం తేమ మించితే అసలు కొనుగోలు చేయడం లేదు. దీంతో గత్యంతరం లేక రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇదే అదనుగా వ్యాపారులు అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా లో అయితే తేమ 12 శాతానికి పైగా ఉంటే రూ. 2 వేలు కూడా చెల్లించడం లేదు.కొన్ని ప్రాంతాల్లో అయితే పత్తి నల్లగా మారిందని చెప్పి 1200 మాత్రమే చెల్లిస్తున్నారు.దీంతో చాలా ప్రాంతాల్లో రైతులు ఆందోళనలకు దిగాల్సి వస్తోంది.

 తీసుకొచ్చిన పత్తిని రైతులు తిరిగి తీసుకెళ్లరని వ్యాపారులు ఉద్దేశపూర్వకంగానే ధరలు భారీగా  తగ్గిస్తున్నారు. రోజువారి వేలంపాట లోను వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. రైతుల వద్ద పత్తి పంట ఉన్నప్పుడు ధర పెంచని వ్యాపారులు, పంట విక్రయించిన తర్వాత చివరలో ధరలు పెంచుతూ రావడం గత కొన్నేళ్లుగా జరుగుతోంది. దీంతో రైతులు నష్టపోవాల్సి వస్తుండగా..వ్యాపారులు లాభపడుతున్నారు. దున్నడం,విత్తనాల కొనుగోలు, విత్తనాలు నాటడం, కలుపు, గుంటకలు తిప్పడం,ఎరువులు, పురుగు మందులు వంటి పనుల కోసం ఎకరానికి 25 వేలకు పైగా రైతులు పెట్టుబడి పెట్టారు.ఈసారి పలుచోట్ల బ్యాంకర్లు అప్పులు ఇవ్వకపోవడంతో వడ్డీ వ్యాపారుల వద్ద రూ.2నుంచి  రూ.5  వడ్డీకి అప్పులు తీసుకొచ్చి పంట సాగు చేపట్టారు. గులాబి రంగు పురుగు ఉధృతి లేకపోవడంతో  పత్తులు చాలా ఏపుగా పెరిగాయి. కొన్ని ప్రాంతాల్లో పత్తికి 1200 మాత్రమే చెల్లిస్తున్నారు. ఎకరానికి సుమారు 3 క్వింటాళ్ల నాణ్యమైన పత్తి, మిగతా 2 కింటాళ్లు నల్లగా మారిన పత్తి రావడంతో రైతులకు పెట్టుబడులు కూడా చేతికి అందడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: