నందమూరి తారక రామారావు.. ఈ పేరు చెప్పగానే ఎంతో మంది ప్రజల పెదవుల మీద చిరునవ్వు విరబూస్తుంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకొని అప్పట్లో ఆయన లేకపోతే మద్రాస్ నుంచి తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్ కి వచ్చేది కాదు. సాంఘీకం, జానపద, పౌరాణిక వంటి ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. నందమూరి తారక రామారావు డ్యాన్స్ వేశారంటే ప్రేక్షకులు ఆనందోత్సాహాలతో ఊగిపోయే వారు.

ఇక ఎన్టీఆర్‌ సినీ ఇండస్ట్రీలో ఎవరికీ ఎలాంటి కష్టం వచ్చినా సరే నేనున్నాను అంటూ ఆదుకునే గొప్ప మహనీయుడు. ఇప్పటివరకు ఆయన సహాయం పొందని వారంటూ బహుశా ఎవరూ లేరేమో. కేవలం సినీ ఇండస్ట్రీ లోనే కాకుండా నిజ జీవితంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్ర‌జ‌ల స్థితిగ‌తుల‌ను చూసి చ‌లించిన ఆయ‌న‌ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి, కేవలం తొమ్మిది నెలల ప్రచారంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్టీఆర్ అతి తక్కువ సమయంలోనే సీఎం పదవిని చేపట్టడం చరిత్రలో రికార్డు అని చెప్పవచ్చు.

కేవలం సీఎం పదవిని చేపట్టడమే కాకుండా బడుగు బలహీన వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని, అన్నదాత సుఖీభవ అన్నట్టుగా ప్రతి ఒక్కరి జీవితాల‌ను ఎన్టీఆర్‌ మార్చారు. ఇంతటి గొప్ప మహనీయమైన వ్యక్తి గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంత గొప్పగా చెప్పారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. నేను చిన్నగా ఉన్నప్పుడు నందమూరి తారకరామారావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవికి ప్రచారం చేస్తున్నప్పుడు పదవిని చేపడితే కేవలం రెండు రూపాయలకే కిలో బియ్యం ఇస్తానని హామీ ఇచ్చారు..

అప్పుడు అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ వాళ్లు పార్టీని నిలబెట్టుకోవడం కోసం ఎన్నికల ముందు కేవలం ఆరు నెలల సమయం ఉన్నప్పుడు ప్రజలకు రూ.1.90 పైసలకే కిలో బియ్యం ఇస్తామని ప్రకటించారు. ప్రజలు మాత్రం అప్పటివరకు బియ్యం ధరలు తగ్గించకుండా ఉన్న మీరు నందమూరి తారకరామారావు గారి చెప్పడంతో మీరు తగ్గిస్తున్నారు కదా అంటూ కాంగ్రెస్ పార్టీపై మండిపడుతూ నందమూరి తారకరామారావును గెలిపించారు.. ఇక ఇంత గొప్ప వ్యక్తి ని జీవితంలో ఏ ఒక్కరు మర్చిపోలేరు అంటూ సీ ఎమ్ వెల్లడించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: