ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రాజధానిలో అంశం హాట్ హాట్ గా మారింది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కు అమరావతి రాజధానిగా ప్రకటించారు. కృష్ణా - గుంటూరు జిల్లాల మ‌ధ్య లో ఈ రాజ‌ధాని ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లాలోని తాడికొండ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధి లో రాజ‌ధాని తో పాటు కోర్ భ‌వ‌నాలు అన్ని ఉండేలా డిజైన్ చేశారు. అయితే జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే అమరావతి రాజధానిగా వద్దని... అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటూ ఆంధ్ర ప్రదేశ్ కు మూడు రాజధానులు కావాలంటూ సంచలన ప్రకటన చేశారు. 2019 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ సమావేశాల సాక్షిగా జ‌గ‌న్ చేసిన ఈ ప్ర‌క‌ట‌న పెద్ద సంచ‌ల‌నం రేపింది.

జ‌గ‌న్ ప్ర‌భుత్వం మూడు రాజ‌ధానుల పేరుతో పెద్ద హ‌డావిడి చేసింది. మూడు రాజ‌ధానులు ఉంటాయ‌ని అసెంబ్లీ లో బిల్లు కూడా ఆమోదం తెలిపింది. ప్ర‌భుత్వం మార‌డంతో అస‌లు అమ‌రావ‌తి లో అప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ప‌నులు కూడా ఆగిపోయాయి. ఇక ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వం అనూహ్యంగా మూడు రాజ‌ధానుల బిల్లు ను ఉప సంహ‌రించు కున్న‌ట్టు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది.

ఈ బిల్లులో త‌ప్పులు ఉన్నాయ‌ని.. తాము కొత్త బిల్లు తో మ‌ళ్లీ మూడు రాజ‌ధానుల బిల్లు ప్ర‌వేశ పెడ‌తామ‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం చెపుతోంది. ఈ క్ర‌మంలోనే అస‌లు ఏపీ రాజ‌ధాని గా ఏది ఉండాల‌ని తాజాగా ఓ ప్రైవేటు సంస్థ స‌ర్వే చేసింది. ఈ స‌ర్వేలో మెజార్టీ ప్ర‌జ‌లు అంటే 85 శాతం మంది మాత్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని గా అమ‌రావ‌తే ఉండాల‌ని చెప్పారు. ఇది అన్ని జిల్లాల‌కు మ‌ధ్య‌లో ఉంద‌ని వారు చెప్పారు.

కేవ‌లం 8 శాతం మంది మాత్ర‌మే మూడు రాజ‌ధానులు ఉంటే అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ జ‌రుగుతుంద‌ని చెప్పారు. మూడు రాజ‌ధానులు ఉన్న దక్షిణాఫ్రికా లో ఏ మాత్రం అభివృద్ధి జ‌ర‌గ‌లేద‌ని .. ఒక రాజ‌ధాని తోనే అభివృద్ధి జ‌రుగుతుంద‌ని స‌ర్వేలో ప‌లువురు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: