గత ఎన్నికల తర్వాత చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పరిస్తితి చాలా దారుణంగా ఉన్న విషయం తెలిసిందే. ఘోర ఓటమితో నియోజకవర్గాల్లో టీడీపీ కష్టాల్లోకి వెళ్లిపోయింది. అయితే ఈ రెండున్నర ఏళ్లలో ఆ కష్టాల నుంచి పార్టీ ఇప్పుడుప్పుడే బయటపడుతుంది. కానీ పూర్తి స్థాయిలో మాత్రం బయటపడలేదనే చెప్పాలి. ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ పికప్ అవ్వాల్సిన అవసరముంది.

 అసలు కొన్ని నియోజకవర్గాల్లో అయితే పార్టీ పరిస్తితి ఇంకా దారుణంగానే ఉంది. అందులో ముఖ్యంగా కర్నూలు జిల్లాలోని కోడుమూరు అయితే ఇంకా దారుణం. అసలు ఈ నియోజకవర్గంలో టీడీపీ లేదనే చెప్పాలి. అదేంటి పార్టీ లేకపోవడం ఏంటి అని అనుకోవచ్చు..అవును ఇది నిజమే కోడుమూరులో టీడీపీ జెండా సైతం కనిపించడం లేదు. అసలు మొదట నుంచి ఈ నియోజకవర్గం టీడీపీకి అనుకూలమైనది కాదు. 1983 నుంచి 2019 వరకు చూసుకుంటే 9 ఎన్నికలు జరిగాయి...అంటే టీడీపీ వచ్చిన దగ్గర నుంచి...కానీ 9 సార్లు ఎన్నికలు జరిగితే కేవలం ఒక్కసారి మాత్రమే కోడుమూరులో టీడీపీ గెలిచింది..అది కూడా 1985లో అంటే ఎప్పుడో 35 ఏళ్ల క్రితం అక్కడ పార్టీ గెలిచింది. మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడు పార్టీ గెలవలేదు.

అంటే కోడుమూరులో టీడీపీ పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మధ్యలో అనేక సార్లు రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది ఆ సమయంలో కూడా పార్టీ కోడుమూరులో గెలవలేదంటే...అక్కడ టీడీపీకి అంత సీన్ లేదని చెప్పొచ్చు. కాకపోతే 2014లో వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేని మాత్రం టీడీపీలోకి తీసుకున్నారు. కానీ ఆ తర్వాత ఆయన కూడా పార్టీని వదిలేశారు. ఇక 2019 ఎన్నికల్లో పార్టీ మళ్ళీ ఘోరంగా ఓడిపోయింది. ఓడిపోయాక ఇక్కడ పార్టీని నడిపించే నాయకుడు లేరు. ఇప్పటికీ అక్కడ పార్టీకి నాయకుడు లేరు. దీని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో ఎవరోకరిని నిలబెట్టిన సరే కోడుమూరులో టీడీపీ గెలవడం కష్టమే అని చెప్పొచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: