తెలంగాణ సీఎం కేసీఆర్ రెండోసారి సీఎం అయ్యాక ఆయన తీసుకున్న నిర్ణయాలపై ప్రతిపక్ష పార్టీ నేతల నుంచే కాకుండా... తెలంగాణలో సాధారణ ప్రజానీకం నుంచి కూడా తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఇక పదవుల విషయంలో కూడా కేసీఆర్ కొన్ని సామాజిక వర్గాల‌కే పెద్దపీట వేస్తున్నారని విమర్శలు కూడా ఉన్నాయి. ఏదో ఇవ్వాలి కాబట్టి కొన్ని పదవులు మాత్రమే బీసీ, ఎస్సీ వర్గాలకు ఇస్తున్నారు తప్ప కెసిఆర్ భర్తీ చేస్తున్న పదవులు ఎక్కువగా అగ్ర సామాజిక వర్గాలకు చెందిన నేతలకు దక్కుతున్నాయి అన్నది వాస్తవం. ఇటీవల భర్తీ చేసిన ఎమ్మెల్సీ పదవుల్లో కూడా ఎక్కువ పెదవులు రెడ్డి , వెల‌మ‌ సామాజిక వర్గం వారికే దక్కాయి.

ఇక కేసీఆర్ తన సొంత సామాజిక వర్గానికి చెందిన నేతలకు ఎక్కువగా పదవులు ఇస్తున్నారు విమర్శలు ముందు నుంచి ఉన్నాయి. తెలంగాణలో చాలా తక్కువగా ఉన్న సామాజిక వర్గానికి చాలా ఎక్కువ స్థాయిలో ప‌దువుల వ‌స్తున్నాయని ప్రతిపక్షనేతలు ముందునుంచి ఆరోపిస్తున్నారు. 2014 తర్వాత తమ వర్గానికి చెందిన కవిత - వినోద్ కుమార్ - కేసీఆర్ ముగ్గురు ఏకంగా ఎంపీలు అయ్యారు. ఇక ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వెల‌మ‌ వర్గానికి చెందిన కవిత , భాను ప్రకాష్ రావు ఎమ్మెల్సీలు అయ్యారు.

ఇక ఇప్పుడు బండ ప్రకాష్ ముదిరాజ్ ఖాళీ చేసిన రాజ్యసభ స్థానాన్ని కూడా తన సామాజిక వర్గానికి చెందిన దామోదర్ రావుకు కేసీఆర్‌ ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆయ‌న‌ నమస్తే తెలంగాణ పత్రిక ఎండి గా ఉన్నారు. కేసీఆర్ కు అత్యంత ఆప్తుడు దామోద‌ర్ రావు వెల‌మ‌ వర్గానికి చెందిన వ్యక్తి. బండ ప్రకాష్ ముదిరాజ్ ఖాళీ చేసిన రాజ్యసభ స్థానాన్ని అదే బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలతో ఎందుకు భర్తీ చేయడం లేదన్న ప్రశ్న లు ఉత్పన్నం అవుతున్నాయి.

కేసీఆర్ కేవలం తన సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తున్నారని మరోసారి ఫ్రూవ్ అయిందని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. మరి దీనికి టిఆర్ఎస్ నేతల నుంచి ... కేసీఆర్ నుంచి ఎలాంటి ఆన్సర్ వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: