ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఒక విష‌యం హాట్‌టాపిక్‌గా మారింది. ఇటీవ‌ల అసెంబ్లీలో చంద్ర‌బాబు సీన్‌.. త‌ర్వాత‌.. మీడియా ముందు ఆయ‌న రోద‌న‌లు చూసిన త‌ర్వాత‌.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విష‌యం చ‌ర్చ‌కు వ‌చ్చింది. అయితే.. దీనిపై ఎవ‌రు విన్నా.. విన‌కున్నా.. మేం మాత్రం.. బాగా వినిపిస్తాం.. అస‌లు ఏం జ‌రిగిందో క‌ళ్ల‌కు క‌డ‌తాం.. అంటూ.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న గౌర‌వ స‌భ‌ల పేరిట ఊరూ వాడా..త‌న‌స‌తీమ‌ణిని వైసీపీ నాయ‌కులు అవ‌మానించారంటూ.. ప్ర‌చారం చేస్తున్నారు.

అయితే.. ఈ ప‌రిణామం.. వైసీపీకి ఇబ్బందిగా మారింద‌ని.. పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. దీని పై వైసీపీ లో నూ అంత‌ర్మ‌థ‌నం సాగుతోంది. అస‌లు ఎందుకు ఇలా జ‌రిగింది ? ఎలా జ‌రిగింది ? అనే చ‌ర్చ జోరుగా ఉంది. అయితే.. ఎవ‌రూ కూడా నోరు విప్ప‌డం లేదు. ఇంత‌లోనే.. నెల్లూరుకు చెందిన కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి, క‌డ‌ప జిల్లాకు చెందిన రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్ రెడ్డిలు.. స్పందించారు.

చంద్ర‌బాబు స‌తీమ‌ణి విష‌యంలో సానుకూలంగా మాట్లాడారు. దీంతో.. టీడీపీలోని ఒక విభాగం ఈ వీడియోల‌ను ప్ర‌చారం చేస్తూ.. ఇంకేముంది..వైసీపీ ప‌ని అయిపోయింది.. అన్న‌ట్టుగా ప్ర‌చారం చేస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ ప‌రిణామాల క్ర‌మంలో అస‌లు ఏం జ‌రిగింద‌నే విష‌యంపై వైసీపీ సీనియ‌ర్లు కూడా దృష్టి పెట్టారు. ఈ క్ర‌మంలో కొంద‌రు సీనియ‌ర్లు ఒక విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నారు.

``త‌ప్పు జ‌ర‌గ‌లేదు. కానీ, మాపై ప‌డిన మ‌ర‌క‌ల‌ను తుడుచుకునే బాధ్య‌త మాత్రం మాదే. అందుకే మా నాయ‌కులు ఎలాంటి భేష‌జాల‌కు పోకుండా.. వ్య‌వ‌హ‌రిస్తున్నారు. త‌ప్పు చేసిన వారు ఎవ‌రూ కూడా నోరు విప్ప‌రు.కానీ, మా నాయ‌కులు ఎలాంటి త‌ప్పు చేయ‌లేదు. త‌ప్పు చేశామ‌ని అంటున్న టీడీపీ నేత‌లు కూడా ఎవ‌రూ నిరూపించ‌లేదు. ఈ నేప‌థ్యంలో త‌గ్గినంత మాత్రాన త‌ప్పులేదులే`` అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: