కొద్ది రోజులుగా ఏపీ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా మారిన కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ మోహ‌న్ ప‌ని అయిపోయిందా ? ఆయ‌న రాజ‌కీయంగా ఇక నిల‌దొక్కు కోలేరా ? ఆయ‌న వేసిన రాంగ్ స్టెప్పులే ఆయ‌న‌కు మైన‌స్ అయ్యాయా ? అంటే ఏపీ లో ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాలు గ‌మ‌నిస్తుంటే అవున‌నే రాజ‌కీయ వ‌ర్గాలు అంటున్నాయి. వంశీ 2014 ఎన్నిక‌ల తో పాటు 2019 ఎన్నిక‌ల్లోనూ టీడీపీ నుంచి గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే గా వ‌రుస‌గా రెండోసారి విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత వంశీ టీడీపీకి దూరం అయ్యి వైసీపీ చెంత చేరిపోయారు.

వైసీపీ లో చేరిప్ప‌టి నుంచి కూడా చంద్ర‌బాబు, నారా లోకేష్ ను గ‌ట్టిగా టార్గెట్ చేస్తూ వ‌స్తున్నారు. పైగా చంద్ర‌బాబు సామాజిక వ‌ర్గానికి చెందిన వంశీ కాస్త దూకుడు గా ఉంటార‌న్న పేరుంది. అయితే ఇటీవ‌ల లోకేష్ పుట్టుక గురించి ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఆ త‌ర్వాత వైసీపీ వాళ్లు బాగా వాడుకున్నారు. అసెంబ్లీ లో కూడా వాడుకుని చివ‌ర‌కు చంద్ర‌బాబు క‌న్నీళ్లు పెట్టుకునే వ‌ర‌కు వెళ్లింది. అయితే దీనిపై తీవ్ర విమ‌ర్శ‌లు రావ‌డంతో వైసీపీ వెన‌క్కు త‌గ్గింది.

వంశీతో మాకు సంబంధం లేద‌ని. అత‌డు టీడీపీ ఎమ్మెల్యే అని రివ‌ర్స్ అయిపోయారు. చివ‌ర‌కు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా తాము త‌ప్పు చేయ‌లేద‌ని.. త‌మ‌ది త‌ప్పు అయితే త‌మ క‌న్నీళ్ల‌తో భువ‌నేశ్వ‌రి కాళ్లు క‌డుగుతామ‌ని కూడా వైసీపీ లో ఉన్న రెడ్డి వ‌ర్గం ఎమ్మెల్యేలు చెపుతున్నారు. అస‌లు త‌మ పార్టీకి సంబంధం లేని నేత ఎవ‌రో ఏదో అంటే దానిని త‌మ పార్టీకి ఎలా ఆపాదిస్తారు ? అని వారు చెపుతున్నారు. దీంతో వంశీ ఇప్పుడు అటు వైసీపీకి .. ఇటు టీడీపీకి రెండిటికి ఎటూ కాకుండా మిగిలిపోయారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు ఎవ‌రు సీటు ఇస్తారో ?  కూడా తెలియ‌ని ప‌రిస్థితి. ఏదేమైనా వంశీ రాంగ్ స్టెప్ ఆయ‌న కెరీర్‌ను నాశ‌నం చేసేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: