గత ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయి...బీజేపీలోకి వెళ్ళిన కొందరు నేతలు...ఇప్పుడు మళ్ళీ టీడీపీ వైపు చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసిన ఓడిపోయిన నేతలు...టీడీపీలో ఉంటే ఇబ్బంది పడాలని చెప్పి...వైసీపీలోకి వెళ్లలేక...సేఫ్‌సైడ్‌గా బీజేపీలోకి వెళ్ళిపోయారు. అలా అని బీజేపీకి ఏపీలో పెద్ద సీన్ లేదు. ఇప్పటికీ ఆ పార్టీ పరిస్తితి ఎలా ఉందో అందరికీ తెలుసు. ఆఖరికి జనసేనతో పొత్తు పెట్టుకున్నా సరే ఒక వార్డు గెలవలేని స్థితిలో ఉంది.

కాకపోతే కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి...ఆ పార్టీలో ఉంటే రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవనే ఉద్దేశంతోనే కొందరు నేతలు ఆ పార్టీలోకి వెళ్లారని చెప్పొచ్చు. అలా అని ఆ పార్టీలో పోటీ చేస్తే ఒక్కరికీ కూడా డిపాజిట్ రాదు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఆ విషయం బీజేపీలోకి వెళ్ళిన నాయకులకు కూడా తెలుసు. అయితే ఇప్పుడుప్పుడే రాష్ట్రంలో రాజకీయాలు మారుతున్నాయి...టీడీపీకి కాస్త పట్టు దొరుకుతుంది. పూర్తిగా వైసీపీని డామినేట్ చేయలేకపోయినా సరే..కొద్దిగా కొద్దిగా టీడీపీ పికప్ అవుతుంది.

ఇలా నిదానంగా రానున్న రెండున్నర ఏళ్లలో టీడీపీ పికప్ అయితే..వచ్చే ఎన్నికల్లో వైసీపీకి గట్టి పోటీ ఇవ్వొచ్చు. ఇక అప్పుడు ఎన్నికల సమయంలో ఉండే పరిస్తితులని బట్టి కొందరు బీజేపీ నేతలు...టీడీపీలోకి రీఎంట్రీ ఇవ్వొచ్చని తెలుస్తోంది. అలా రీఎంట్రీ ఇచ్చే వారిలో గోనుగుంట్ల సూర్యనారాయణ(వరదాపురం సూరి)కూడా ఉంటారని ప్రచారం జరుగుతుంది.

2014 ఎన్నికల్లో సూరి అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున పోటీ చేసి గెలిచారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయారు...ఓడిపోయాక టీడీపీని వీడి బీజేపీలోకి వెళ్లారు. కానీ ఎప్పుడు చంద్రబాబుని విమర్శించలేదు. ఈయన లోకల్‌ వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డిపైనే విమర్శలు చేస్తూ ముందుకెళుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు..మరి ఈయన టీడీపీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం నడుస్తోంది. కానీ ప్రస్తుతం ధర్మవరం బాధ్యతలు పరిటాల శ్రీరామ్ చూసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనే పోటీ చేయొచ్చని తెలుస్తోంది. మరి అలాంటప్పుడు సూరి రాజకీయం ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: