ఏపీలో గత సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఎన్నికలు ముగిసిన తర్వాత టీడీపీకి చెందిన పలువురు కీలక నేతలు అధికార వైసీపీలోకి జంప్ చేసేసారు. ఆ మాటకొస్తే తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు సైతం ఇప్పుడు వైసిపి ఉన్నారు. వీరిలో చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం - గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ - విశాఖ ద‌క్షిణం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ - గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు కూడా టీడీపీకి దూరమై జగన్ చెంత చేరి పోయారు.

అయితే టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన చాలామంది నేతలకు ఇక్కడ ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయింది. పార్టీ అధిష్టానం వారిని పట్టించుకోవటం మానేసింది. ఎవరో ఒకరిద్దరు నేతలు మినహా మిగిలిన అందరూ నేతలకు కనీసం చిన్న చిన్న పదవులు కూడా రావడం లేదు. వారు పార్టీలో డ‌మ్మీలు గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన ఇద్దరు మహిళా నేతలు ఇప్పుడు తిరిగి పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఆ ఇద్దరూ ఎవరో కాదు మాజీ మంత్రి శమంతకమణి , ఆమె కుమార్తె అయిన శింగనమల మాజీ ఎమ్మెల్యే యామిని బాల. వీరిద్దరూ ఇప్పుడు తిరిగి టీడీపీలోకి వచ్చేందుకు రెడీగా ఉన్నారట. సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి వీరిని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.

తాము వైసీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు లేదని నిర్ణయానికి వచ్చేసిన ఈ ఇద్దరు తల్లీకూతుళ్లు ఇప్పుడు చంద్రబాబు ఓకే చెబితే టిడిపి కండువా కప్పుకోవ‌డానికి రెడీగా ఉన్నారట. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వీరు తిరిగి టీడీపీలోకి వచ్చినా ? వారికి రాజకీయ భవిష్యత్తు ఉంటుందా ? అన్నది మాత్రం చూడాల్సి ఉంది. మ‌రి ఈ త‌ల్లి కూతుళ్ల రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఎలా ఉంటుందో ?  చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: