ఇటీవల తమిళనాడులోని నీలగిరి హిల్స్ లో భారత ఆర్మీ కి చెందిన హెలికాప్టర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రమాదం జరిగిన ఘటన దేశాన్ని మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. అయితే హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ దుర్మరణం పాలు కావడంతో అటు దేశాన్ని మొత్తం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటనలో బిపిన్ రావత్ తో పాటు ఆయన సతీమణి మరికొంతమంది ఆర్మీ కమాండర్ లు కూడా దుర్మరణం పాలయ్యారు. మొత్తంగా 14 మందితో బయల్దేరిన హెలికాప్టర్ కుప్పకూలడంతో 13 మంది ప్రాణాలు కోల్పోగా ఒక్కరు మాత్రమే బయటపడ్డారు. ఇక ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో గమనార్హం..


 ఇక పోతే ఇక హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్నోరకాల వీడియో వైరల్ గా మారిపోతున్నాయి. ఈ క్రమంలోనే కొంత మంది ప్రత్యక్ష సాక్షులు కూడా ఆసక్తికర విషయాలను చెబుతున్నారు. హెలికాప్టర్ ప్రమాదం జరిగిన సమయంలో తాను బిపిన్ రావత్ ను సజీవంగా చూశాను అంటూ ప్రత్యక్షసాక్షి శివకుమార్ తెలపడం గమనార్హం. టీ ఎస్టేట్ లో పనిచేస్తూ ఉంటాడు శివకుమార్. ఈ క్రమంలోనే సమీపంలో మంటలు చెలరేగి హెలికాప్టర్ పడిపోవడం తాను చూశానని దీంతో కొంతమందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నా శివ కుమార్  తెలిపారు.


 ప్రమాద స్థలంలో మూడు మృతదేహాలు కనిపించాయి. ఈ క్రమంలోనే అక్కడ ఒక వ్యక్తి సజీవంగా ఉండడాన్ని గమనించాను అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే మంచినీళ్లు కావాలని ఒక వ్యక్తి నన్ను అడిగారు అంటూ శివకుమార్ తెలిపాడు. ఇక ఆయనను బెడ్ షీట్ లో చుట్టి కొండ మీద నుంచి కిందకు తీసుకు వచ్చి రక్షణ దళాలకు అప్పగించినట్లు శివకుమార్ చెప్పుకొచ్చాడు. అయితే మూడు గంటల తర్వాత ఆయనే బిపిన్ రావత్ అని ఎవరో నాకు చెప్పారని తెలిపాడు. ఆ తర్వాత ఆయన చనిపోయారు అని తెలిసింది అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. దేశం కోసం ఎంతో సేవ వ్యక్తికి కనీసం చివరి సమయంలో నీళ్ళు కూడా ఇవ్వలేక పోయాను అంటూ తెలిపాడు శివకుమార్.  నీళ్ళు ఇచ్చి ఉంటే ఆయన బతికేవాడేమో అంటూ కంటతడి పెట్టుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: