చికెన్, మటన్.. ఈ పేరు ఎత్తగానే అందరి నోళ్లు ఊరి పోతూ ఉంటాయి. ఎందుకంటే మాంసం అంటే అంత ఇష్టపడుతూ ఉంటారు. సాధారణంగా ఒకప్పుడు కేవలం వారాంతంలో మాత్రమే చికెన్ మటన్ లాంటివి తినేవారు. కానీ నేటి రోజుల్లోమాత్రం ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడే మాంసం తినడం లాంటివి చేస్తున్నారు. ముఖ్యంగా మాంసం ప్రియులకు అయితే ముక్క లేనిదే ముద్ద దిగదు అనే విధంగా ఉంటుంది. అందుకే ప్రతిరోజు మటన్ చికెన్ తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు.


 అయితే ఇటీవలి కాలంలో మటన్ చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి అనే విషయం తెలిసిందే. దీంతో మాంసం ప్రియులందరికీ షాక్ తగులుతూనే ఉంది. ప్రస్తుతం చికెన్ ధరలు 200 రూపాయల వరకు పలుకుతోంది. ఇక మటన్ ధరలు అయితే అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇక ప్రస్తుతం మటన్ కొనుగోలు చేయాలి అంటే దాదాపు 600 పైనే పడుతుంది అని చెప్పాలి. దీంతో సామాన్యులకు మటన్ తినడం అనేది చాలా కష్టంగానే మారిపోతుంది. దీంతో మటన్ తినాలని ఉన్నప్పటికీ చివరికి చికెన్తో సరిపెట్టుకుంటున్నారు చాలామంది. అయితే బయట 600 రూపాయలు పలుకుతున్న కిలో మటన్ కేవలం 50 రూపాయలకే అమ్మితే ఎలా ఉంటుంది.



 ఏంటి కేవలం 50 రూపాయలకా.. ఇంతకంటే మంచి ఆఫర్ దొరుకుతుందా గురు అనీ మురిసిపోతూ ఉంటారు మాంసం ప్రియులు. ఇక ఇప్పుడు మాంసం ప్రియులకు వాల్మీకిపురం వ్యాపారులు కూడా ఇలాంటి ఒక గుడ్ న్యూస్ చెప్పారు. ఒకరి మీద ఒకరి పోటీతో ఏకంగా మాంసాన్ని 50 రూపాయలకు విక్రయించారు. ఇటీవలే ఆదివారం సాయంత్రం రోజున జనాలు ఎగబడ్డారు. దీంతో మటన్ వ్యాపారుల మధ్య పోటీ పెరిగింది. జనాలను ఆకర్షించేందుకు ఒకరి మీద  ఒకరు పోటీ తో ధర తగ్గించారు.చివరికి 50 రూపాయలకు వచ్చింది. చిత్తూరు జిల్లా వాల్మీకిపురం గాంధీ బస్టాండ్ పక్కన భారీగా మటన్ షాపులు ఉండగా..  ఒక వ్యక్తి 300 రూపాయలకే కిలో మటన్ అమ్మడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత మిగతా వారు అంతకంటే తక్కువగా అమ్మగా ఇలా ఒకరికి ఒకరు పోటీగా ధర తగ్గిస్తూ వచ్చి చివరికి 50 రూపాయలకు చేరుకుంది. దీంతో మాంసం ప్రియులు  పండగ చేసుకున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: