ఉమ్మడి ఖమ్మం జిల్లాపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో పోరు కాంగ్రెస్ వర్సెస్ టిఆర్ఎస్ గా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పూర్తి ఆధిక్యం సాధించింది. రాష్ట్రంలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ కు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా ఫలితాలు షాక్ ఇచ్చాయి. అలాంటి సమయంలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు, నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ లో చేర్చుకోవడం ద్వారా గులాబీ పార్టీ సంతృప్తి పడింది. కానీ వచ్చే ఎన్నికల నాటికి సొంతగా కారు గుర్తు పైనే మెజారిటీ సీట్లు సాధించాలని టిఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకుంది. ఖమ్మం జిల్లా కేంద్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మీద ఉమ్మడి జిల్లా నేతలను సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లే బాధ్యతలను పెట్టింది.కానీ నేతల తీరు మంత్రికి మింగుడు పడడం లేదు. ఇక మాజీలు కొందరు తమకు ఎలాంటి పదవులు రాకపోవడానికి అజయే కారణమనే భావనతో ఉన్నారు.

దీంతో అధికార పక్షంలోనే అంటి ముట్టనట్లుగా ఉంటున్న లీడర్లు సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆ ఎఫెక్ట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనిపించింది. 150కి పైగా తెరాస ఓట్లు కాంగ్రెస్ కి పడ్డాయి. దీంతో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలే మరోసారి రిపీట్ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇటీవల రాష్ట్ర నాయకత్వం మారడంతో కాంగ్రెస్ కార్యకర్తలకు కొత్త జోష్ వచ్చినట్లయింది. ఇక కొత్త పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఖమ్మంపై నజర్ పెట్టారు. ఇటీవల తనను జిల్లా నేతలు కలిసిన సందర్భంలో చాలా అంశాలపై వారితో తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మంచి రీసల్ట్స్ ఇచ్చిన ఈ జిల్లా నుండే తన కార్యాచరణ మొదలుపెడతానని చెప్పారు. అలాగే జిల్లా కీలక నేత భట్టి విక్రమార్క కూడా ఖమ్మం జిల్లా పెండింగ్ సమస్యల్లో పోరాటానికి సిద్ధమయ్యారు. అయితే మధిర నియోజకవర్గం లోని ముదిగొండ నుండి ఈ పాదయాత్ర ప్రారంభం కానుంది.

 ఇక్కడి నుండి  నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని టచ్ చేస్తూ యాత్రకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే జనవరి 9వ తేదీ నుండి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తవ్వగానే జిల్లా వ్యాప్తంగా పాదయాత్ర కు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకి కొంత జోష్ వచ్చింది.దీన్ని కంటిన్యూ చేయడం కోసం జిల్లా అంతటా పాదయాత్ర చేయాలని చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: