కొంత కాలమే ప్రాభవంతో మెలిగేది
ఆ తరువాత ఇబ్బందులు తప్పవు
ఇక్కట్లను దాటుకుని రావడం అంత సులువు కాదు
జగన్ కు పెద్దిరెడ్డి భయం ఉంది
బాబుకు వంశీ అండ్ కో భయం ఇంకా ఉంది
ఈ రెండూ చాలు..రెండు ప్రధాన పార్టీలలో ముసలం వచ్చేందుకు!
వచ్చే ఎన్నికల్లో ఆంధ్రాకు సీఎంకు ఎవరు అన్నది అప్పుడే తేలిపోయింది. ఓ విధంగా ఇప్పటికిప్పుడు అత్యుత్సాహంతో రాస్తున్నదే అయినా రాజకీయంలో ఏ సమయంలో గాలి ఎటు పోతుందో ఎవరికి తెలుసు. ఆ విధంగా చూసుకున్నా ఇప్పటికప్పుడు ఎన్నికలు ఉంటే సీఎం ఎవరు? కౌన్ బనే గా ఆంధ్రా సీఎం అంటే..ఒక పేరు మాత్రం వైసీపీ నుంచే వినపడుతుంది. ఎందుకంటే ఆయనే ఇవాళ్టి రాజకీయాల్లో హాట్ టాపిక్ .. ఓ విధంగా జగన్ కు , ఆయనకు ఉమ్మడి శత్రువు చంద్రబాబే అయినప్పటికీ కాస్తో కూస్తో తనదైన పరిణితితో ఆలోచించి పనిచేయడంలో చంద్రబాబును ఎన్నడో దాటేశారు ఆయన. ఆయనే పెద్దిరెడ్ది. యూనివర్శిటీ పోలిటిక్స్ లో చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేసిన రోజుల నుంచి ఇప్పటిదాకా పెద్దిరెడ్డి కోపం చంద్రబాబుపై అలానే ఉంది. ఇంకా పెరుగుతూ కూడా వస్తోంది. అయితే కాలగతిలో అన్నీ అనుకూలించి అదృష్టం కలిసివచ్చి ఆయన మంత్రి నుంచి ముఖ్యమంత్రి దాకా ఎదిగిపోయారు. కానీ పెద్దిరెడ్డి మాత్రం ఇన్నాళ్లకు మంత్రి అయి హోదానూ, దర్పాన్నీ వెలగబెడుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు భంగపాటు తప్పదని జోస్యం ఒకటి వినిపిస్తోంది. అలా అని కొత్త పార్టీ ఏదీ తెరపైకి వస్తుందని ఖచ్చితంగా చెప్పలేం. ఒకవేళ వైసీపీలోనూ, టీడీపీలోనూ చీలిక వస్తే కొత్త పార్టీ కి పెద్దిరెడ్డి సారథ్యం వహించి నాలుగు ఓట్లు సీట్లు తెచ్చుకుంటే ఆయనే సీఎం. ఎందుకంటే ఆంధ్రా రాజకీయాల్లో ఎప్పటి నుంచో చక్రం తిప్పాలని షర్మిల అనుకుంటున్నారు. జగన్ తో విభేదాలు ఉన్న కారణంగా ఆమె బాబాయ్ పెద్దిరెడ్డికి సాయం చేస్తే చేయొచ్చు. అదేవిధంగా రాజకీయాల్లో ఏ పరిణామం ఎలా ఉంటుందో తెలియదు కనుక ఈ సీన్ కు బీజేపీకి స్క్రీన్ ప్లే రాసినా రాయొచ్చు. టీడీపీ, వైసీపీ కొట్లాటలో మధ్యే మార్గం కొత్త పార్టీ వస్తే మాత్రం చాలా అనూహ్య పరిణామాలు చోటు చేసుకునేందుకు దారులు ఉన్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి