
ఓ వైపు అగ్ర రాజ్యాలైన బ్రిటన్ రష్యా లాంటి దేశాలు ఓమిక్రాన్ వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోతూనే ఉంది. దీంతో కొన్ని ప్రాంతాలలో అయితే లాక్ డౌన్ విధించే పరిస్థితులు కూడా వచ్చాయి. అయితే అటు భారత్లో కూడా తక్కువ కేసులు వెలుగులోకి వచ్చినా కూడా కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు వస్తున్నారు.. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ విధించడం లాంటివి కూడా చేశారు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా దేశంలో తొలి ఓమిక్రాన్ కేసు నమోదైన కర్ణాటకలో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ అమలులో కి వచ్చేసింది.
ఇక ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రానున్న రోజుల్లో లాక్డౌన్ తప్పదు అని నిపుణులు చెబుతున్నారు. విదేశాల తరహాలోనే కేసుల సంఖ్య వేలకు చేరింది అంటే ప్రభుత్వాలు తప్పకుండా లాక్ డౌన్ విధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో గతంలో కరోనా వ్యాప్తి చెందిన సమయంలో మొదట నైట్ కర్ఫ్యూ తో మొదలుపెట్టి కేసులు పెరుగుతున్న కొద్దీ ప్రభుత్వం కఠిన అంశాలను తీసుకు వచ్చింది అన్న విషయాన్ని గుర్తు చేశారు. అయితే ఆ దేశ రాజధాని ఢిల్లీలో కూడా క్రమక్రమంగా కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన ఏడు నెలల్లో తొలిసారిగా గరిష్ఠంగా నేడు 331 కేసులు నమోదయ్యాయి.