సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వచ్చి కొత్తగా పార్టీలు పెట్టిన ఇద్దరు నెంబర్ 1 హీరోలు...తిరుపతి నుంచే తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఆ ఇద్దరు నెంబర్ 1 హీరోలు ఎవరో ఈ పాటికే అర్ధమైపోయి ఉంటుంది. తెలుగుదేశం పెట్టి ఎన్టీఆర్ 1983లో తిరుపతి అసెంబ్లీ బరిలో నిలబడి విజయం సాధించారు. ఇక 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి చిరంజీవి తొలిసారి తిరుపతి బరిలో నిలబడి గెలిచారు. ఇలా ఇద్దరు బడా హీరోలకు తొలి విజయం అందించిన తిరుపతిలో ఇప్పుడు వైసీపీ హవా నడుస్తోంది. 

అయితే మొదట నుంచి తిరుపతిలో ఏ పార్టీకి అండగా ఉంటూ రాలేదు. ఇక్కడ మిక్స్‌డ్ ఫలితాలు వచ్చేవి. 1983లో టీడీపీ గెలవగా, 1985, 1989ల్లో కాంగ్రెస్, 1994, 1999 ఎన్నికల్లో టీడీపీ, 2004లో కాంగ్రెస్, 2009లో ప్రజారాజ్యం...2012 ఉపఎన్నికలో వైసీపీ, 2014లో టీడీపీ, 2015 ఉపఎన్నికలో టీడీపీ, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది.

గత ఎన్నికల్లో కేవలం 700 ఓట్ల తేడాతో వైసీపీ నుంచి భూమన కరుణాకర్ రెడ్డి విజయం సాధించారు. ఇక వైసీపీ కూడా అధికారంలోకి రావడంతో తనదైన శైలిలో పనిచేసుకుంటూ ముందుకెళుతున్నారు. అయితే ప్రస్తుతం తిరుపతిలో భూమన స్ట్రాంగ్‌గానే ఉన్నారు. ఆయనకు ధీటుగా టీడీపీ నాయకురాలు సుగుణమ్మ కూడా పనిచేస్తున్నారు. మళ్ళీ టీడీపీ నుంచి గెలవడానికి ట్రై చేస్తున్నారు. అయితే ఇప్పుడు పరిస్తితులని చూస్తే ఇక్కడ భూమనకు చెక్ పెట్టడం ఈజీ కాదు. ఇక్క‌డ వైసీపీ చాలా స్ట్రాంగ్‌గా ఉంది.

అయితే ఓ ఈక్వేష‌న్ ప్ర‌కారం భూమనకు చెక్ పెట్టే అవకాశాలు ఉన్నాయి...అది ఎలా అంటే ఒకవేళ టీడీపీ-జనసేనలు కలిస్తే ఇక్కడ భూమనకు చెక్ పెట్టడం ఈజీ. అయితే ఇక్కడ పవన్ కల్యాణ్ డైరక్ట్‌గా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. పవన్ బరిలో దిగిన భూమనకు ఇబ్బందే. అలా కాకుండా టీడీపీ-జనసేనలు కలిసిన భూమనకు చిక్కులు తప్పవు. లేదంటే తిరుపతిలో భూమనదే పైచేయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: