తమ దేశ రక్షణ విషయంలో ఇజ్రాయిల్ ఎంత ఖచ్చితత్వంతో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమ దేశ రక్షణకు భంగం కలుగుతుంది అని భావిస్తే ఎంతకైనా తెగించేందుకు సిద్ధ పడుతూ ఉంటుంది ఇజ్రాయిల్. ఇక ప్రస్తుతం ప్రపంచ దేశాల కంటే ఎంతో అత్యుత్తమమైన ఇంటిలిజెంట్  వ్యవస్థను కలిగి ఉన్న దేశంగా ఇజ్రాయిల్ కొనసాగుతూ ఉంటుంది. శత్రుదేశాల కదలికలను ఎప్పటికప్పుడు గమనించడమే కాదు కాస్త తేడా కొట్టింది అంటే చాలు శత్రుదేశాల పై విరుచుకు పడి దాడి చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటుంది ఇజ్రాయిల్. ఈ క్రమంలోనే ఇరాన్ పై ఇప్పటి వరకు ఎన్నో సార్లు ఆయుధాలతో దాడులకు పాల్పడిన సందర్భాలు కూడా ఉన్నాయి.



 అయితే ఇజ్రాయిల్ తమ దేశ రక్షణకు భంగం కలిగించే తీవ్రవాదులతో ఎప్పటికప్పుడు మినీ సైజ్ యుద్ధమే చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే గతంలో ఏకంగా హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయిల్ పై వరుసగా రాకెట్లతో దాడికి పాల్పడటం సంచలనం గానే మారిపోయింది. ఇజ్రాయిల్ రాడార్ వ్యవస్థ ఇక ఎలాంటి నష్టం కలగకుండా రక్షించడంలో సక్సెస్ అయింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలి కాలంలో ఇజ్రాయిల్ అటు దేశ రక్షణ విషయంలో కొత్త పుంతలు తొక్కుతుంది అన్నది అర్ధమవుతుంది. ఆయుధాలా  ద్వారా ఏకంగా జంతువులను కూడా తమకు ఆయుధాలుగా మార్చుకోవాలని ప్లాన్ కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.



ఈ క్రమంలోనే ఏకంగా సముద్రంలో ఉండేటువంటి డాల్ఫిన్ లను మచ్చిక చేసుకొని ట్రైనింగ్ చేసి సైనికుల లాగా యుద్ధానికి వాడుతున్నరన్నా విషయం ఇప్పుడు తెరమీదికి వచ్చింది.   ఇటీవలే ఒక డాల్ఫిన్ కి చెవిలో హెడ్ఫోన్ లాంటిది ఉండడాన్ని హమాస్ తీవ్రవాదులు గుర్తించారట. ఏకంగా హమాస్ తీవ్రవాదులకు సంబంధించిన కమాండర్ ను డాల్ఫిన్ ఒక్కసారిగా మింగేసిందట. ఇక హెడ్ ఫోన్స్ సహాయంతో డాల్ఫిన్ ను ఆపరేట్ చేస్తున్నారు అన్న విషయాన్ని గుర్తించామని చెబుతూ దీనికి సంబంధించిన  కొన్ని స్టేట్మెంట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: