చంద్రబాబునాయుడుకు ఎల్లోమీడియాకు ఉన్న దమ్మెంతో తేలిపోయిందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీషుమీడియంను ప్రవేశపెట్టబోతున్నట్లు కేసీయార్ ప్రభుత్వం డిసైడ్ చేసింది. అలాగే ప్రైవేటు విద్యాసంస్ధల్లో  ఫీజుల నియంత్రణకు ఒక కమిటి వేయాలని కూడా క్యాబినెట్ సమావేశంలో డిసైడ్ చేశారు. ఈ రెండు అంశాలపైన చంద్రబాబు కానీ ఎల్లోమీడియా కానీ వ్యతిరేకంగా ఒక్కమాట కూడా మాట్లాడలేదు.




సీన్ కట్ చేస్తే ఇదే నిర్ణయాలను ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా తీసుకున్నది. ఇంకేముంది ఆకాశమేదో బద్దలైపోయినట్లు చంద్రబాబు అండ్ కో తో పాటు ఎల్లోమీడియా నానా గోల చేసింది. ఒక సామాజికవర్గం ఆర్ధిక మూలాలను దెబ్బకొట్టడానికే జగన్ ఇలాంటి నిర్ణయాలను తీసుకున్నారంటు పెద్ద రచ్చే చేసింది. టీడీపీ మద్దతుదారుల ఆర్ధిక మూలాలను జగన్ దెబ్బకొడుతున్నాడంటూ గోల గోల చేశారు.




అంతటితో ఆగకుండా తమకు మద్దతుగా నిలబడుతున్న ఇతర పార్టీల నేతలతో కూడా ఆరోపణలు చేయించారు. చివరకు తమ వాళ్ళతోనే టీడీపీ నేతలు కోర్టుల్లో కేసులు వేయించారు. ఇక ఎల్లోమీడియా ఛానళ్ళయితే రోజుల తరబడి టీవీల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా డిబేట్లు కూడా నిర్వహించారు. మొత్తానికి నానా పాట్లుపడి కోర్టు ద్వారా ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకున్నారు. సరే ప్రభుత్వం పై కోర్టులో రివ్యూ పిటీషన్ వేసిందనుకోండి అది వేరే సంగతి.




ఇక్కడ గమనించాల్సిందేమంటే ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్ధులు, వాళ్ళ ప్యారెంట్స్ హ్యాపీ. కానీ చంద్రబాబు, ఎల్లోమీడియాకే ప్రభుత్వ నిర్ణయం నచ్చక అడ్డుకున్నారు. మరి ఇదే నిర్ణయం ఇపుడు కేసీయార్ కూడా తీసుకున్నారు. ఎందుకని ఏపీలో చేసినట్లు తెలంగాణాలో గోల చేయటంలేదు. కేసీయార్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎందుకని మాట్లాడటంలేదు. తమ టీవీ చానళ్ళల్లో ఎందుకు డిబేట్లు పెట్టలేదు. ఇక్కడే తెలిసిపోతోంది కేసీయార్ అంటే వీళ్ళకంతా ఎంత భయమో. కేసీయార్ నిర్ణయాన్ని వ్యతిరేకించి, తప్పుపట్టి మళ్ళీ ఇక్కడ ఉండగలరా ?

మరింత సమాచారం తెలుసుకోండి: