నేటి నాగరిక సమాజంలో కూడా ఆడపిల్లలు  తీవ్రస్థాయిలో వివక్షకు గురవుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఇప్పటికి మగాళ్లు చేతుల్లో కీలుబొమ్మల్లాగానే మారిపోయారు ఆడపిల్లలు. మహిళా సాధికారత సాధించేందుకు ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్న మహిళలకు అడుగడుగునా ఎన్నో అవాంతరాలు ఎదురవుతున్నాయి. పెళ్లి చేసుకుని మెట్టినింట్లో అడుగుపెట్టిన తర్వాత ఎంతోమంది మహిళలు తీవ్ర స్థాయిలో వేధింపులకు గురవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఇలా మహిళలు ఎవరైనా వివక్షకు గురి అయితే వారికి నేనున్నాను అండగా నిలిచే స్థాయిలో ఆమె ఉంది. ఇక రాష్ట్రంలో ఉన్న మహిళలందరిలో కూడా ధైర్యం నింపే హోదాలో ఆమె కొనసాగుతోంది. ఏకంగా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉంది ఆమె.  కానీ నన్ను నా భర్త రోజూ కొడతాడు అంటూ ఇటీవలే ఆమె చెప్పిన మాటలు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం రాజకీయ వేడి రాజుకుంది అన్న విషయం తెలిసిందే. ఎంతో మంది ఓటర్లను తమవైపు తిప్పుకుని గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇక ఇలాంటి సమయంలో ఉత్తరప్రదేశ్కు చెందిన బీజేపీ నేత మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్వాతి సింగ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయాయి.


 నా భర్త నన్ను రోజూ కొడతాడు.. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దూ అంటూ మంత్రి స్వాతి సింగ్ ఓ వ్యక్తి తో ఫోన్లో మాట్లాడిన ఆడియో లీక్ అయింది.. ఇప్పుడు ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. కాగా మంత్రి స్వాతి సింగ్ భర్త దయ శంకర్ 2016లో బీఎస్పీ అధినేత్రి మాయావతి పై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ ఒక్కసారిగా తెర మీదికి వచ్చారు.  కాగా ప్రస్తుతం స్వాతి సింగ్ భర్త దయ శంకర్ కూడా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు అన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఏదేమైనా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా  రక్షణ కల్పించడంలో ముందు ఉండాల్సిన మంత్రి తనకి ఇలాంటి పరిస్థితి ఉంది అంటూ చెప్పటం మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది. మరి ఆడియో నిజమైనదేనా లేదా ఎవరైనా కావాలని సృష్టించారా అన్న చర్చ కూడా మొదలయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: