దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇవన్నీ ఒమిక్రాన్ కేసులేనని.. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెబుతోంది. ప్రజల అనుభవము కూడా అదే.. అయితే.. ఈ ఒమిక్రాన్ వ్యాప్తిలో మాత్రం మిగిలిన వేరియంట్ల కంటే చాలా ముందు ఉంది. మరి ఇందుకు కారణం ఏంటి.. గతంలోని వేరియంట్ల కంటే ఇది ఎందుకు బాగా వ్యాపిస్తుంది.. అన్న విషయం పరిశీలించిన పరిశోధకులకు అసలు రహస్యం తెలిసింది.


అదేంటంటే.. ఈ ఒమిక్రాన్ వేరియంట్.. చాలా ఎక్కువ సేపు జీవిస్తోంది. ప్రత్యేకించి ప్లాస్టిక్‌ ఉపరితలంపై ఈ ఒమిక్రాన్ వేరియంట్ వైరస్‌ దాదాపు 8 రోజుల వరకూ బతికే ఉంటోందట. మనిషి చర్మంపై ఇది దాదాపు 8 గంటలపాటు జీవంతోనే ఉంటోందట. అందుకే ఇది మిగిలిన అన్ని వేరియంట్ల కంటే చాలా వేగంగా వ్యాపిస్తోందన్నమాట. అంటే కరోనా వచ్చిన రోగి.. దగ్గినా, తుమ్మినా.. ఒమిక్రాన్ వేరియంట్ పరిసర ప్రాంతాలపై పడుతుంది. అది ప్లాస్టిక్‌ ఉపరితలంపై పడితే.. దాదాపు 8 రోజుల వరకూ బతికి ఉంటే.. దాన్ని మరెవరో తాకే ప్రమాదం ఎక్కువ. అందుకే అది ఎక్కువ మందికి వ్యాపిస్తుందన్నమాట.


అందుకే వైద్య నిపుణులు.. తరచూ చేతులు కడుక్కోవడం, శానిటైజర్ వాడటం ద్వారా ఈ వ్యాప్తిని అరికట్ట వచ్చని సూచిస్తున్నారు. గతంలో ఆల్ఫా, బీటా, డెల్టా, గామా వేరియంట్లు వచ్చినా ఇవి ఇంత సమయం బతికి ఉండలేదు. వైరస్‌ ఎన్నిగంటల పాటు పర్యావరణంలో జీవించి ఉంటుందనే అంశమే దాని వ్యాప్తిలో కీలక పాత్ర పోషిస్తుందన్నమాట.


ఆల్ఫా, బీటా, డెల్టా వేరియంట్లతో పోలిస్తే.. ఒమిక్రాన్‌ వేరియంట్లు అత్యధిక పర్యావరణ స్థిరత్వాన్ని కలిగి ఉన్నాయని తేలింది. అందువల్లే ఈ వేరియంట్లతో ఎక్కువ వ్యాప్తి జరిగింది. ఒక అధ్యయనం ప్రకారం ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్లాస్టిక్‌ పై 193.5 గంటల పాటు బతికి ఉంటుందట. అదే ఒరిజినల్‌ స్ట్రెయిన్‌ 56 గంటలు, ఆల్ఫా 191.3 గంటలు, బీటా 156.6 గంటలు, గామా 59.3గంటలు, డెల్టా 114 గంటల పాటు ప్లాస్టిక్‌ పై జీవించగలవని పరిశోధకులు కనిపెట్టారు. ఇంత కెపాసిటీ ఉంది కాబట్టే ఒమిక్రాన్ ఇంతగా విజృంభిస్తోంది. అందుకే శానిటైజర్ వాడండి.. తరచు చేతులు కడుక్కోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: