ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు రాజ్యమేలుతున్నారు. వారి పాలనలో అక్కడి ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం అవ్వడమే కాకుండా, అక్కడి ప్రజల జీవన స్థితిగతులు చాలా దయనీయంగా తయార య్యాయి. దాదాపు దేశంలోని సగం మందికి పైగా ప్రజలు తీవ్రమైన సంక్షోభంలో కూరుకు పోయారు. మరి ఆహారం కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసుకుందామా..? తాలిబన్ల పాలనలోని ఆఫ్ఘనిస్తాన్ లో ఆహార సంక్షోభం మరింత తీవ్రమైంది. కరోనా, కరువు, ఆర్థిక సంక్షోభంతో ఆ దేశం అల్లాడుతోంది.సగం కంటే ఎక్కువ జనాభా ఆకలితో అల మటిస్తున్నారు.

 ఆ దేశ ప్రజలు ఆకలి తీర్చుకునేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో పిల్లలు, పిల్లలు అవయవాలను అమ్ము కుంటున్నారని యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం చీఫ్ డేవిడ్ బీస్లీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫ్గాన్ లో తనను కలిసిన ఒక మహిళ తన బిడ్డను బలవంతంగా మరో ఫ్యామిలీకి అమ్ముకుందని చెప్పారు. జర్మనీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డేవిడ్ ఈ విషయాలు వెల్లడించారు. ఆఫ్గన్ ఇప్పుడు ఘోరమైన విపత్తును ఎదుర్కొంటోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.దేశంలోని నాలుగు కోట్ల జనాభాలో 2.3 కోట్ల మంది ఆకలితో అల్లాడుతున్నారని తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటికే ప్రపంచ పేద దేశాల్లో ఒకటని, దాదాపు 20 ఏళ్ల నుంచి తాలిబన్లతో పోరాటం చేస్తోందని డేవిడ్ గుర్తు చేశారు.

మానవతా దృక్పథంతో ఆఫ్ఘనిస్తాన్ ను ఆదుకోవాలని ప్రపంచ దేశాలకు మరోసారి విజ్ఞప్తి చేశారు. కరోనా టైంలో ప్రపంచ బిలియనీర్లు చాలా సంపాదించారని, వారందరి ఒక్క రోజు సంపాదన ఇస్తే ఆఫ్ఘనిస్తాన్ లో అందరి ఆకలి తీర్చవచ్చని చెప్పారు. బిలియనీర్ లు సహాయం చేయాలని పిలుపునిచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ కు మన దేశం మరోసారి మందులు పంపింది.  మూడు టన్నుల మెడిసిన్స్ ను కాబూల్ లోని ఇందిరా గాంధీ హాస్పిటల్ కు తరలించినట్లు విదేశాంగ శాఖ శనివారం తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: