బొగ్గు గనుల్లో మసే కాదు మాణిక్యాలూ ఉన్నాయి
వెలుగు కలిసే దారుల్లో ఉద్యమ ప్రకాశికలు ఉన్నాయి
వెలుగు చీకటి మధ్య తీరూ తెన్నూ ఒక నాటి రూపు
రేపటికి అది చెదిరిన స్వప్నం కావొచ్చు..
ఉద్యోగుల ఉద్యమాలు చేస్తున్నారు. చేస్తున్న ప్రతిసారీ ముఖ్యమంత్రిని తిడుతున్నారు. రైలు పట్టాల వెంబడి పరుగులు తీసి విజయవాడ చేరుకున్నారు. రైలు పట్టాలే కాదు ఇంకా కొన్నిఅడ్డదారుల్లోనూ ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ విజయవాడ చేరుకున్నారు.గమ్యం చేరుకున్న ఆనందం బాగుంది. రేపటి నుంచి మన బడి బాగుంటుందా? వేతనాలు తగ్గాయి సర్ బాగుంది ఒప్పుకుంటాం మీరు మీ పని తీరు బాగుందని చెప్పండి అప్పుడు మీ తరఫునే మాట్లాడతాం.
మధ్యాహ్న భోజనం బిడ్డలకు అందకపోతే ఎంత మంది టీచర్లు సర్ క్యారేజ్ ఓపెన్ చేసి ముద్దలు పెట్టారు. అవును సర్ ఆయన ముద్దులు పెట్టాడు ఒప్పుకుంటాం గుద్దులు గుద్దాడు ఒప్పుకుంటాం మీరేం చేస్తున్నారు సర్..మీ వల్ల కలిగే లాభాలేంటో చెప్పండి..పాపం పదివేల జీతం పదినెలలుగా రాని ఉద్యోగి ఒకడు నాకు తెలుసు సర్ ..వాడికి మీ జీతంలో కొద్దిపాటి అయినా తీసి ఇవ్వగలరా? ఇచ్చి మాట్లాడండి చచ్చు పుచ్చు మాటలు చెప్పకండి..వాటి వల్ల మాకేం ఉపయోగం లేదు.
బడి కోసం డబ్బులు పెట్టే టీచర్లను చూశాను..అమ్మ లాంటి టీచర్లను ఎంతమందినో చూశాను..వాళ్లు కదా కావాలి..తన సొంత డబ్బులతో పేదలకు ఊతం ఇచ్చి చదివించే తల్లిని చూశాను. పొంగిపోయాను ..ఆ స్ధాయిలో మీరుంటే మీలో కొందరన్నా ఆ స్థాయికి చేరుకుంటే మా బడులు మా ఆఫీసులు బాగుంటాయి.
వారానికో రోజు శ్రమదానం అనేవాడు.. మీరు ఒప్పుకున్నారా చేశారా ఫొటోలకు ఫోజులిచ్చారా? మరిచిపోయారా? బయోమెట్రిక్ అటెండెన్స్ కావాలని పట్టుబట్టాడు మీరు ఒప్పుకున్నారా చేశారా లేదా అడ్డదారిలో థంబ్ వేసి ఇంటికి పోయారా?ఫైళ్ల క్లియరెన్స్ కు ఆయన ప్రాధాన్యం ఇచ్చాడు..ఇవాళ ఆ పని ఒక్కరన్నా చేస్తున్నారా.. ముందు మీ నుంచి ఈ ప్రభుత్వం ఏం కోరుకుంటుందో తెలుసుకోండి.. ఆ తరువాతే ఏమయినా! నిజాయితీ ఉన్న ఉద్యోగులు దేశాన పది శాతం మన రాష్ట్రాన ఒక్క శాతం..వీరి కోసం అయితే నేనే కాద్సార్ ఎవ్వరయినా మాట్లాడతారు.. కనుక మీరు భాషను దిద్దుకోండి..మారువేషాల్లో విజయవాడ కు చేరుకున్నారు సరే! వేషంతో పాటు భాష దిద్దుకోండి..ఎవరో అన్నారు కవి రసరాజు అన్నారని.. వేషం బాగున్నప్పుడే వేదిక దిగిపోండి..ఆలోచించండి చాలు..మీ కన్నా దీనావస్థలో బతుకు ఈడుస్తున్న వాళ్ల కన్నా మీరే బెటర్..
- బాధ్యత గల ఉద్యోగులకు
మద్దతిస్తాను
తిని నిద్రపోయే దున్నపోతులకు కాదు
అవినీతి సొమ్ముతో బతికే వాళ్లకు అంత కన్నా కాదు
- రత్నకిశోర్ శంభుమహంతి
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి